తెలంగాణ వేదికగా జరిగిన గ్లోబల్ సమ్మిట్ అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్టను పెంచిందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు ఇప్పుడు తెలంగాణ వైపు ఆసక్తిగా చూస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సమ్మిట్ విజయంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రానికి పెట్టుబడులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం కేసీఆర్‌కు ఇష్టం లేనట్లు ఆయన మాటలు ఉన్నాయని మంత్రి మండిపడ్డారు. ఈ సమ్మిట్ ద్వారా 5 లక్షల కోట్ల…
CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్ బృందం భేటీ అయ్యింది. డ్యుయిష్ బోర్స్ ( Deutsche Borse) కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో ఇవాళ తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్(GCC)ని ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రికి జర్మనీ బృందం వివరించింది. GCC ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు జర్మనీ బృందానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు.