HYD Metro : మరోసారి మెట్రో ట్రైన్లో సాంకేతిక సమస్య.. రెండు వైపులా నిలిచిన మెట్రో రైళ్లు..
- మరోసారి మెట్రో ట్రైన్లో సాంకేతిక సమస్య
- అమీర్‌పేట్-రాయదుర్గం మార్గంలో అంతరాయం
- జూబ్లీ చెక్‌పోస్టు దగ్గర నిలిచిపోయిన మెట్రో ట్రైన్
- రెండు వైపులా నిలిచిన మెట్రో రైళ్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYD Metro : నగరవాసులకు అత్యంత వేగవంతమైన ప్రయాణాన్ని అందించే హైదరాబాద్ మెట్రోలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. అమీర్‌పేట్ – రాయదుర్గం (బ్లూ లైన్) మార్గంలో శుక్రవారం ఉదయం సాంకేతిక కారణాల వల్ల రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాయదుర్గం వైపు వెళ్తున్న మెట్రో రైలు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ స్టేషన్లో అకస్మాత్తుగా ఆగిపోయింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో దాదాపు 12 నిమిషాల పాటు రైలు అక్కడే నిలిచిపోయింది.
TC Rajan Dead: పలమనేరు మాజీ ఎమ్మెల్యే రాజన్ కన్నుమూత.. నిరాడంబర జీవనానికి నిలువెత్తు నిదర్శనం!
Also Read
దీని ప్రభావంతో ఈ మార్గంలోని ఇరువైపులా (అమీర్‌పేట్ , రాయదుర్గం వైపు) నడిచే రైళ్లపై ప్రభావం పడింది. ఒక్కసారిగా రైళ్లు నిలిచిపోవడంతో కార్యాలయాలకు, ఇతర పనులకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మెట్రో సిబ్బంది వెంటనే స్పందించి సాంకేతిక లోపాన్ని సరిచేశారు. సమస్య క్లియర్ కావడంతో కొద్దిసేపటి క్రితమే రైళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం రైళ్ల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని మెట్రో అధికారులు తెలిపారు. అయితే, తరచూ ఇలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటం పట్ల ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో యాజమాన్యం సరైన నిర్వహణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Siddhu Jonnalagadda : సిద్దు జొన్నలగడ్డ – సితార ఎంటరైన్మెంట్స్.. సినిమా స్టార్ట్
తాజావార్తలు
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Telangana Jobs : మెడికల్ జాబ్స్ అలర్ట్.. 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల.!
-
PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
-
Virat Kohli: SRH మ్యాచ్‌కు ముందు కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఈ స్థితికి కారణం వారే అంటూ..
-
Peddi: ‘పెద్ది’కి లైన్ క్లియర్.. పర్సంటేజ్ విధానంపై గుడ్ న్యూస్
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!