Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Hyderabad Cp Cv Anand Hyderabad Telangana

CP Anand: త్వరలో పోలీస్ వ్యవస్థ పునర్వవస్థీకరణ.. రాజధానిలో 40 కొత్త స్టేషన్లు

Published Date :May 20, 2023 , 2:48 pm
By NTV WebDesk
CP Anand: త్వరలో పోలీస్ వ్యవస్థ పునర్వవస్థీకరణ.. రాజధానిలో 40 కొత్త స్టేషన్లు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Hyderabad CP CV Anand: హైదరాబాదులో మెగాసిటీ పోలీస్ ప్రాజెక్టు ప్రారంభంకానుంది. పోలీస్ వ్యవస్థ పునర్ వశీకరణ ప్రారంభానికి సన్నాహాలు మొదలయ్యాయి. హైదరాబాదులో కొత్తగా 40 పోలీస్ స్టేషన్ కి ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ట్రాఫిక్ లా అండ్ టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు కానుంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు ఏర్పాటు మొదలయ్యాయి. 35 సంవత్సరాల తర్వాత కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. 35 ఏళ్ల తర్వాత హైదరాబాద్ పోలీస్‌ పునర్వ్యవస్థీకరణ జరిగిందన్నారు. శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో జనాభా విపరీతంగా పెరిగిందన్నారు. సీఎం ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో మౌలిక వసతుల కల్పన, శాంతి భద్రతల పెంపుదలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పోలీస్ స్టేషన్ల పెంపు, జోన్ల ఏర్పాటుపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. పునర్వ్యవస్థీకరణ కమిటీ 6 నెలల పాటు కూర్చుని కొత్త పోలీస్ స్టేషన్లను ప్రతిపాదించిందని చెప్పారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 35 ఏళ్ల క్రితం 25 లక్షల జనాభా ఉండేదని, ఇప్పుడు 85 లక్షలకు పెరిగిందన్నారు.

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్లు కలిపి 1.60 కోట్ల మంది ప్రజల శాంతి భద్రతలను అదుపు చేస్తున్నాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2 కొత్త డీసీపీ జోన్లు, 11 ఏసీపీ డివిజన్లు, 11 కొత్త లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లు, 13 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, 5 కొత్త మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటయ్యాయి. కేసులు పెరుగుతున్న కొద్దీ పోలీస్ స్టేషన్లు భారంగా మారుతున్నాయన్నారు. సచివాలయానికి కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని… బీఆర్కేలో సచివాలయ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సచివాలయ భద్రత కోసం ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు విధులు నిర్వహించనున్నారు. సైబర్ క్రైమ్‌ల కోసం ఒక డీసీపీతో పాటు 148 మంది పోలీసు అధికారులను నియమించినట్లు తెలిపారు.

జూన్ 2 నుంచి కొత్త పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని.. 35% సివిల్ కానిస్టేబుళ్లు, 120 ఎస్ ఐ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కొత్త పోలీస్ స్టేషన్లకు అనువైన వాహనాలు, కంప్యూటర్లు, బైక్ లు అందజేస్తామని వెల్లడించారు. కొత్త పోలీస్ స్టేషన్లకు ప్రభుత్వం రూ.33 కోట్లు కేటాయించిందని సీపీ ఆనంద్ పేర్కొన్నారు. కొత్త పోలీస్ స్టేషన్లతో కలిపి హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం 78 పోలీస్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ కలెక్టరేట్ భవనాన్ని అబిడ్స్ పోలీస్ స్టేషన్‌గా మార్చారని అన్నారు. బీఆర్కే భవన్‌లోని సెక్రటేరియట్ పోలీస్ స్టేషన్ ఫిలింనగర్‌లోని ఆపరేటివ్ సొసైటీ ప్రాంగణంలో ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రెహ్మత్ నగర్ ఓపీ భవనం మధురానగర్ పోలీస్ స్టేషన్, సైఫాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భవనంలోని ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్, హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ భవనంలోని మసాబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్, బోరబండ పోలీస్ స్టేషన్ వద్ద బోరబండ అవుట్ పోస్ట్ పోలీస్ ఏర్పాటు చేయనున్నట్లు సీపీ ఆనంద్ వెల్లడించారు.
Fast food: ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? యమ డేంజర్..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CP CV Anand
  • hyderabad
  • Hyderabad CP CV Anand
  • telangana
  • Telangana New police stations

తాజావార్తలు

  • Central Govt: మీకు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసా..? అయితే రూ.10 వేలు మీకే..

  • Madhapur job scam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లు బురిడీ..

  • AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలివే..

  • Donald Trump: “యుద్ధం మళ్లీ మొదలవుతుంది”.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..

  • Sangeeth Sobhan: నిహారిక లేకపోతే.. సంగీత్ శోభన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions