బిర్యానీని లొట్టలేసుకుంటూ తింటున్నారా.. జర ఇది చూడండి..
- బిర్యానీ ప్రియులకు షాక్
- పోలీసుల రైడ్‌లో బయటపడ్డ నిజాలు
- ఫ్రిడ్జ్‌లో పాత స్టాక్
- హోటల్ సీజ్, కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ప్రాంతమైన బంజారాహిల్స్‌లో వెలుగుచూసిన కుళ్లిన బిర్యానీ ఉదంతం నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ‘లక్కీ బిర్యానీ షవర్మాస్’ అనే రెస్టారెంట్ బాగోతాన్ని బంజారాహిల్స్ పోలీసులు రట్టు చేశారు. అసలు వివరాల్లోకి వెళ్తే, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ టూలోని వెంకటరమణ కాలనీకి చెందిన కొండారెడ్డి అనే వ్యక్తి ఆదివారం ఉదయం ఒక ఆన్‌లైన్ ఫుడ్ యాప్ ద్వారా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. అయితే, డెలివరీ అయిన ప్యాకెట్ తెరవగానే అందులో నుంచి విపరీతమైన దుర్వాసన రావడమే కాకుండా, బిర్యానీ పూర్తిగా కుళ్లిపోయి ఉండటాన్ని గమనించిన ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్‌లైన్‌లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు రెస్టారెంట్‌పై ఆకస్మిక దాడులు నిర్వహించగా విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. జీడిమెట్లలో మూడు రోజుల క్రితమే తయారు చేసిన బిర్యానీని ప్యాకెట్లుగా మార్చి, ఇక్కడి అవుట్‌లెట్ లోని ఫ్రిడ్జ్‌లో భద్రపరుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆన్‌లైన్‌లో ఎవరైనా ఆర్డర్ చేసినప్పుడు, ఆ పాత ప్యాకెట్లను తీసి ఓవెన్‌లో వేడి చేసి కొత్త బిర్యానీలా కస్టమర్లకు పంపిస్తున్నట్లు విచారణలో తేలింది. హోటల్ ప్రాంగణం అంతా అపరిశుభ్రంగా ఉండటమే కాకుండా, ఆహార పదార్థాలు నిల్వ ఉంచిన ఫ్రిడ్జ్‌లో ఎలుకలు కూడా తిరుగుతున్నట్లు పోలీసులు కనుగొన్నారు.
UP: పొలాల్లో హఠాత్తుగా దిగిన 3 సైనిక హెలికాపర్టు.. బెంబేలెత్తిపోయిన గ్రామస్తులు
ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఈ రెస్టారెంట్ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన పోలీసులు, హోటల్ యజమాని ఇర్ఫాన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కుళ్లిన ఆహారాన్ని విక్రయిస్తున్న సదరు హోటల్‌ను వెంటనే సీజ్ చేశారు. ఈ ఘటన ఆన్‌లైన్‌లో ఆహారాన్ని ఆర్డర్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో మరోసారి గుర్తు చేస్తోంది.
తాజావార్తలు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
-
Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
-
Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు