ఎట్టకేలకు హుజురాబాద్ ఉపఎన్నికల్లో తమ అభ్యర్థిని దాదాపు ఖరారు చేసింది కాంగ్రెస్. బలమూర్ వెంకట్ పేరును ఫైనల్ చేశారు. ఇవాళ అధికారికంగా ప్రకటించే అవకాశముంది. గెల్లు శ్రీనివాస్ కు బలమైన పోటీ ఇవ్వడానికి బలమూర్ వెంకట్ ను రంగంలోకి దింపుతున్నట్టు సమాచారం.ప్రస్తుతం ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వెంకట్ కాంగ్రెస్ నుండి యూత్ లీడర్ గా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు…బలమూర్ వెంకట్.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వాడు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా… అటు టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా యువ నాయకుడు గెల్లు శ్రీనివాస్ బరిలో ఉండనుండగా… బీజేపీ పార్టీ తరఫున ఈటల రాజేందర్ ఫైనల్ అయ్యే అవకాశం ఉంది.