వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది.గతంలో లేని విధంగా ఈసారి భారీగా ఆదాయం సమకూరింది. ఖజానా కు గత ఆర్థిక సంవత్సరంలో 87.78 కోట్ల రూపాయల వార్షిక ఆదాయం సమకూరింది. కరోనా కారణంగా సుమారు రెండు నెలల పాటు భక్తులకు దర్శనాలు. నిలిపివేసినప్పటికీ, సమ్మక్క సారక్క జాతర జరగడంతో భక్తులు పోటెత్తారు. 2019-2020 ఆర్థిక సంవత్సరం లో స్వామివారికి లభించిన ఆదాయంతో పోలిస్తే ప్రస్తుత ఆదాయం కాస్త పెరిగిందని అధికారులు చెబుతున్నారు.
సమక్క సారలమ్మ జాతర ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే అనవాయితీ ఉండగా వనదేవతల దర్శనానికి ముందు రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు వేములవాడకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈ క్రమంలో 2019-2020 సంవత్సరంలో జరిగిన సమక్క సారలమ్మ జాతర సందర్భంగా స్వామివారి ఖజానాకు 85 కోట్ల నగదు ఆదాయం సమకూరింది. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద రూ. 87.78 కోట్ల నగదు ఆదాయం స్వామివారికి సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
Read Also: Minister KTR : బండి సంజయ్.. అక్కడ చూసొచ్చి సిగ్గు తెచ్చుకో..
ఇందులో అత్యధికంగా హుండీ కానుకల ద్వారా స్వామివారికి రూ.28.43 కోట్లు, స్వామివారి కోడెమొక్కుల ద్వారా రూ.18.28 కోట్లు, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.13.86 కోట్లు, అర్జిత సేవల ద్వారా రూ.6.83 కోట్లు. లీజులు, అద్దెల ద్వారా రూ.5.35 కోట్లు, శీఘ్ర దర్శనాల ద్వారా రూ.2.17 కోట్లు. స్వామివారికి అద్దె గదుల ద్వారా రూ. 2.71 కోట్లు, ఇతరత్రా రూ.10.24 కోట్ల ఆదాయం ఈ వార్షిక సంవత్సరంలో సమకూరినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.