Visakhapatnam: ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని ముఖపరిచయం లేని వ్యక్తులతో పరిచయం పెంచుకుంటున్నారు. ఆ పరిచయానికి ప్రేమ అనే పేరు పెట్టి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుత కాలంలో ఆకర్షణకి ప్రేమకి మధ్య తేడా తెలుసుకోలేక కొందరు యువతీ యువకులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఓ యువతి తన ప్రియుడితో కలిసి బీచ్ కి వెళ్ళింది. ఈ క్రమంలో ప్రమాదానికి గురైంది. దీనితో ఆ యువతికి ఏదైనా జరిగితే నేరం తన పైకి వస్తుందనుకున్నాడో ఏమో గాని ఆ యువతితో అంబులెన్సు తీసుకొస్తా అని చెప్పి పరారైయ్యాడు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. మచిలీపట్నం కావ్య అనే యువతి భీమవరంకి చెందిన ఫణింద్ర వర్మ రాజు అనే యువకుడితో కలిసి అప్పికొండ బీచ్ కి వచ్చింది. ఈ నేథ్యంలో ఈ జంట ఈ నెల 2వ తేదీ నుండి అప్పికొండ సముద్ర తీరంలో ఉన్న కొండ పై నివాసం వుంటున్నారు. పగలంతా విశాఖలో తిరుగుతూ రాత్రి సమయంలో కొండపై నిద్రిస్తున్నారు.
Read also:America : ప్రపంచంలో రెండో అతి పెద్ద హిందూ దేవాలయం.. అమెరికాలో ప్రారంభం
అయితే అమ్మాయి ప్రమాదవశాత్తు కొండ పైన నుండి జారిపడి రాళ్ళ మధ్య చిక్కుకుపోయింది. దీనితో ఆ యువకుడు అంబులెన్సు తీసుకు వస్తానని చెప్పి అమ్మాయి దగ్గర ఉన్న డబ్బులు, బంగారం తీసుకుని పరారైయ్యాడు. అయితే రాళ్ల మధ్య చిక్కుకున్న యువతిని చూసిన జాలర్లు ఆమెను అతి కష్టం పైన బయటకు తీశారు. అయితే అక్కడకి ఎవరితో వచ్చావు అని జాలర్లు అడగగా వర్మ వెంట వచ్చానని చెప్పడానికి మొదట సందేహిచింది. అయితే చివరికి జరిగింది చెప్పింది. జాలర్లు వాళ్ళ ఫోన్ నుండి వర్మకి కాల్ చేయాగా వర్మ అంబులెన్సు పంపించాడు. కానీ తాను రాలేదు. అయితే కూతురు మిస్ అయిందని గత నెలలో యువతి తల్లిదండ్రులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో యువతి గురించి ఆమె తల్లిదండ్రులకి సమాచారం అందించారు పోలీసులు. ఈ ఘటన గురించి Ntv తో మాట్లాడిన యువతి, యువతి తల్లి అసలు జరిగిన విషయాన్ని తెలిపారు.
Read also:Shamshabad Airport : శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమ బంగారం పట్టివేత.. ప్రయాణికుడు అరెస్ట్.
Ntvకి బాధితులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. యువతి ఫ్యామిలీ తో షిరిడికి ట్రైన్ లో వెళ్తున్నపుడు భీమవరం చెందిన ఫణింద్ర వర్మ రాజు తో పరిచయం ఏర్పడింది. కాగా అతను రిలయన్స్ మార్ట్ లో పని చేస్తున్నాడు.. ఫేస్ బుక్ ద్వారా పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో యువతి తన ప్రియుడితో కలిసి గత నెల 29 వ తేదీన ఇంటి నుండి వచ్చేసింది. ఈ క్రమంలో బైక్ మీద భీమవరం వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఉన్నారు. కాగా ఈ నెల 7వ తేదీన వైజాగ్ వచ్చారు. ఈ నేపధ్యంలో ఆదివారం అప్పి కొండ బీచ్ కు వెళ్లారు. ఈ క్రమంలో యువతి ప్రమాదానికి గురికాగా యువకుడు అంబులెన్సు తీసుకు వస్తాను అని చెప్పి యువతి దగ్గర ఉన్న రూ/ 7 వేలు డబ్బులు, లక్షా 70 వేలు విలువ చేసే బంగారం తీసుకుని ఉడాయించాడు. అయితే రాళ్ల మధ్యన ఇర్రుకుని అపస్మారక స్థితిలో ఉన్న యువతిని జాలర్లు కాపాడి వాళ్ళ ఫోన్ తో వర్మకి కాల్ చేయగా అంబులెన్సు పంపించాడు.