Honor Killing: ఇబ్రహీంపట్నంలో పరువుహత్య.. కూతురుని చంపిన తల్లి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honor Killing: ఇబ్రహీంపట్నంలో పరువుహత్య చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో తన కూతురు కుటుంబ పరువు తీస్తుందని ఓ తల్లి తన కూతురుని చున్నీతో ఉరివేసిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటన హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలోని దండుమైలారంలో చోటుచేసుకుంది.
Read also: Elections 2024: నేడే కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థుల లిస్ట్.. ఆశావహుల్లో ప్రముఖులు..!
Also Read
దండుమైలారంలో జంగమ్మ కుటుంబం నివాసం ఉంటుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. కూతురు భార్గవి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుకుంటుంది. అయితే తను చదవున్న కాలేజీలో శశి అనే అబ్బాయి పరిచయమయ్యాడు. కొద్దిరోజులు స్నేహితులుగా ఉన్న వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. రాను రాను వీరిద్దరు ఎక్కవగా కలవడం మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. అయితే ఈ విషయం కాస్తా భార్గవి కుంటుంబ సభ్యులకు తెలియడంతో రచ్చ రచ్చ చేశారు. శశిని కలవకూడదని పరువు పోతుందని ఇది సరైన పద్దతి కాదని ముందు చదువు మీద శ్రద్ద పెట్టాలని భార్గవి తల్లి జంగమ్మ మందలించింది. అయినా భార్గవి కుటుంబాన్ని, తన తల్లి చెప్పిన మాటలను పక్కన పెట్టి శశిని కలవడం మానలేదు. దీంతో ప్రేమ వ్యవహారంలో గత కొద్దిరోజులుగా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు భార్గవి తల్లి నిరాకరించింది. ఏమైందో ఏమో కానీ.. భార్గవి హత్యకు ముందు కలిసేందుకు ప్రియుడు శశి వచ్చాడు.
Read also: Khammam Police: వింత శబ్దాలతో సైలెన్సర్లు పెడితే వాహనాలు సీజ్..!
దీంతో అది చూసిన తల్లి జంగమ్మ ఆగ్రహంతో ఊగిపోయిది. శశి ఇంటికి ఎందుకు వచ్చాడు అని అడిగింది భార్గవి సమాధానం చెప్పకపోవడంతో తల్లి జంగమ్మ రెచ్చిపోయింది. కూతురు భార్గవి ఏం చేస్తుందో ఏమో అని భయపడి చివరకు కన్న కూతురినే చీరతో ఉరి వేసింది. అయితే ఏమీ తెలియనట్లు కూతురు చనిపోయిందని ఏడుస్తూ కూర్చుంది. అయితే ఈ వ్యవహారంపై భార్గవి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కన్నతల్లే భార్గవిని చంపిందని కేసు పెట్టాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. అయితే భార్గవి హత్యకు ముందు ఇంటికి వచ్చిన శశి ఏం మట్లాడుకున్నారు? ఆతరువాత భార్గవి, తన తల్లి మధ్య ఏం జరిగింది? అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు, భార్గవి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నారు.
SSMB29 Update: స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది.. సినిమాని వేగంగా పూర్తి చేస్తాం: రాజమౌళి
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!