SSMB29 Update in Japan: ప్రస్తుతం భారత్‌లో మోస్ట్ యాంటిసిపేటెడ్ అండ్ హైప్ మూవీ ఏదైనా ఉందంటే అది ‘SSMB29’. దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో ఈ సినిమా వస్తోంది. ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. ఈ సినిమా కథను రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే పూర్తి చేశారు. అయితే ఈ మూవీ అప్‌డేట్ కోసం మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా డైరెక్టర్ రాజమౌళినే స్వయంగా ఓ అప్‌డేట్ ఇచ్చారు.
జపాన్‌లో ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ… ‘SSMB29 స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సినిమాలో హీరో మాత్రమే ఫిక్స్ అయ్యాడు. అతని పేరు మహేష్ బాబు. హీరో చాలా అందంగా ఉంటాడు. సినిమాని కాస్త వేగంగా పూర్తి చేస్తా. మూవీ విడుదల సమయంలో మహేష్ బాబును ఇక్కడికి తీసుకువస్తా’ అని జపాన్ అభిమానులతో అన్నాడు. దాంతో జపాన్ ఫాన్స్ కేరింతలు కొట్టారు. అయితే ఈ సినిమా ఇప్పటిలో పట్టాలు ఎక్కే అవకాశం లేదని, ఎన్నేళ్లు పడుతుందో తెలియదని ఇంకా అసలు స్క్రిప్ట్ అయినా రెడీ అయిందో లేదో అంటూ కామెంట్ చేస్తున్న వారి నోళ్లు మూయించే విధంగా ఈ సినిమా అప్డేట్ ఇచ్చేశాడు రాజమౌళి.
ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్‌లో రూపొందిన ఆర్ఆర్ఆర్ మూవీ బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. జపాన్ అభిమానుల కోసం ఈ సినిమాను ఏకంగా జపనీస్‌లోనూ రిలీజ్ చేశారు. అక్కడ ఆర్ఆర్ఆర్ భారీ హిట్ కొట్టింది. ఈ సందర్భంగా జపాన్ అభిమానులు సోమవారం ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి హాజరయ్యారు. అక్కడ జపాన్ అభిమానుల అభిమానానికి జక్కన్న ఫిదా అయ్యాడు. ఆ కార్యక్రమంలో రాజమౌళి తన తదుపరి సినిమా SSMB29 అప్‌డేట్ ఇచ్చారు.
Also Read: IPL 2024: రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్న స్టార్ క్రికెటర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు షాక్!
SSMB29 సినిమా ప్రారంభోత్సవం ఈ ఉగాదికి జరుగుతుందనే టాక్ ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తోంది. జూన్ చివర్లో లేదా జూలై మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకు సంబంధించిన సెట్ వర్క్ హైదరాబాద్ శివార్లలోని ప్రాంతాల్లో మొదలైందట. రాజమౌళి ఈ సినిమాను రూ. 1000 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు నటులతో పాటు టెక్నీషియన్స్ కూడా వర్క్ చేయనున్నారట.