HMDA : కోకాపేట భూముల వేలం.. నేడు మూడో విడత ఆక్షన్
- రెండు విడతల్లోనే ₹2,708 కోట్లు రాబట్టిన HMDA
- రికార్డు స్థాయి ధరలకు కోకాపేట భూముల డిమాండ్
- మొత్తం 44 ఎకరాల భూమిని నాలుగు విడతల్లో వేలం
- డిసెంబర్ 5న గోల్డెన్ మైల్, మూసాపేట భూముల ఆక్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HMDA : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కోకాపేట నియోపోలీస్ భూముల విలువ రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) దశలవారీగా నిర్వహిస్తున్న భూవేలాలకు పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో నాలుగు ప్లాట్లలోని 19 ఎకరాల భూమిని విక్రయించి ₹2,708 కోట్లు సంపాదించిన HMDA, నేడు మూడో విడత వేలానికి సిద్ధమైంది. ఈరోజు ప్లాట్ నంబర్లు 19, 20లోని 8.04 ఎకరాలకు ఆక్షన్ జరగనుంది. గత విడతల్లో ఎకరాకు ₹151.25 కోట్లు పలికిన రికార్డు ధర ఈసారి కూడా దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మొత్తం 44 ఎకరాల భూమిని నాలుగు విడతల్లో వేలం వేయాలని HMDA నిర్ణయించింది. ఇందులో కోకాపేటలోని 29 ఎకరాలు, మూసాపేటలోని 15 ఎకరాలు ఉన్నాయి. ఇటీవల ఈ నెల 25, 28 తేదీల్లో జరిగిన వేలాల్లో కోకాపేటలోని 19 ఎకరాలకు వేలం పూర్తి కాగా, మిగిలిన భూములకు దశలవారీగా ఆక్షన్లు కొనసాగుతున్నాయి. వచ్చే డిసెంబర్ 5న కోకాపేట గోల్డెన్ మైల్‌లోని 2 ఎకరాలు, మూసాపేటలోని 15 ఎకరాలకు వేలం జరగనుంది. రియల్ ఎస్టేట్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈసారి కూడా ఆశించిన దానికంటే ఎక్కువ ధరలు రావచ్చని HMDA భావిస్తోంది.
Also Read
Andhra King Taluka : ఇది మిస్ అయితే నిజంగా బాధపడేదాన్ని – భాగ్యశ్రీ
తాజావార్తలు
-
Taapsee Pannu: టాలీవుడ్లోకి తాప్సీ రీ ఎంట్రీ.. ఆ డైరెక్టర్‌తో హారర్ మూవీ?
-
H-1B Visa Rules: H-1B ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగించే ప్రతిపాదనకు కీలక ఆమోదం
-
Milk Price Hike: పండుగ సీజన్‌కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
-
Race 4: ‘రేస్’ రీబూట్‌లో అమీర్ ఖాన్.. సిద్ధార్థ్, టైగర్‌తో అల్టిమేట్ యాక్షన్ ?
-
King 100 Glimpse: పుట్టినరోజున అదిరిపోయే సర్ప్రైజ్.. నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్ అదుర్స్.. డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్.!
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!