అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్లే నవజీవన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో టీటీపై దాడి జరిగింది. ఎస్- 1 కోచ్‌లో ఇద్దరు యువకులు టికెట్ కలెక్టర్ కిరణ్‌కుమార్‌పై దాడికి పాల్పడ్డారు. టికెట్ విషయంలో ప్రయాణికుడికి రైల్వే టిటికి మద్య వాగ్వివాదం జరిగింది. టికెట్ లేకుంటే ఫైన్ చెల్లించాలన్న రైల్వే టీ టి పై దాడి చేసిన ప్రయాణికుడు దాడి చేశాడు. గాయాలపాలైన రైల్వే టీటీ కిరణ్ కుమార్ ను మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన మహబూబాబాద్ కు చెందిన రవితేజను జిఆర్పీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో యవకుడు మేతిపట్ల సుమన్ పారిపోయాడు.
Also Read:Perni Nani: జనసేన ఆవిర్భావ సభపై పేర్నినాని సెటైర్లు.. అందుకే పవన్ సభ
వరంగల్ రైల్వే స్టేషన్‌లో మహబూబాబాద్‌కు చెందిన గొల్లపల్లి రవితేజ, వరంగల్‌కు చెందిన మోతిపట్ల సుమన్ టికెట్ లేకుండా ఎస్-1 బోగిలో ప్రయాణిస్తున్నారు. వారిని టికెట్ అడిగినందుకు ఇద్దరు కలిసి టీసీపై దాడికి పాల్పడడంతో కిరణ్‌కుమార్ గాయపడ్డారు. రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో టీసీ కిరణ్‌కుమార్‌ను మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కిరణ్‌కుమార్ ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.