High Court: సెల్లార్ నిర్మాణాలపై అనుమతి తీసుకోవాలి.. హైకోర్టు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Court: అపార్ట్‌మెంట్‌లోని బేస్‌మెంట్‌లో 2012 భవన నిబంధనల ప్రకారం వాచ్‌మెన్ గదితోపాటు రెండు మరుగుదొడ్లు నిర్మించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. 25 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వీటి నిర్మాణం చేపట్టవచ్చని, అయితే ముందస్తు అనుమతి తప్పనిసరి అని తేల్చింది. హైదరాబాద్‌లోని మోహన్ నగర్‌లోని సీటీఓ కాలనీలోని అన్నపూర్ణ అపార్ట్‌మెంట్ బిల్డర్ కె.రమేష్ సెల్లార్‌లో వాచ్‌మెన్ గది నిర్మాణంపై ఈ నెల 7న జీహెచ్‌ఎంసీ జారీ చేసిన పోకాజ్ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ అంశంపై జస్టిస్ టి.వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. 500 చదరపు గజాల విస్తీర్ణంలో 15 ప్లాట్లు ఉన్నాయని, భద్రత కోసం సెల్లార్‌లో వాచ్‌మెన్ గదిని నిర్మించామని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. దీన్ని కూల్చివేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. భవన నిబంధనల ప్రకారం వాచ్‌మెన్ గది నిర్మాణాన్ని చేపట్టవచ్చు. కేవలం షోకాజ్ నోటీసు మాత్రమే ఇచ్చామని, దీనిపై వివరణ ఇచ్చేందుకు పిటిషనర్ కు అవకాశం ఉందని మున్సిపల్ శాఖ తరఫు న్యాయవాది తెలిపారు. వాచ్ మెన్ గది నిర్మాణానికి అనుమతి తీసుకోవాలన్నారు.
Read also: ‘Kalki 2898 AD’ Release Date:కల్కి వాయిదా లేదు.. ఒక్క పోస్టుతో నోళ్లు మూయించారు..
Also Read
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. నిబంధనల ప్రకారం వాచ్‌మెన్ గది నిర్మాణానికి నిబంధనల ప్రకారం అనుమతి ఉన్నప్పటికీ ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ఇక్కడ పిటిషనర్ ఎలాంటి అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టారని, ఈ నెల 24లోగా షోకాజ్ నోటీసుకు వివరణ ఇవ్వాలని పిటిషనర్ ను ఆదేశించింది. అంతే కాకుండా వాచ్‌మెన్ గది నిర్మాణాన్ని క్రమబద్ధీకరించేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. షోకాజ్ నోటీసుపై వివరణతో పాటు, పిటిషనర్ క్రమబద్ధీకరణ దరఖాస్తు (అప్లికేషన్స్) చేస్తే, దానిపై నిర్ణయం తీసుకునే వరకు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశించారు. క్రీడాభివృద్ధిలో భాగంగా ఐఎంజీకి అప్పగించిన భూమిని రిజిస్ట్రేషన్ రద్దు చేయడంపై బాధ్యులైన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారని మరో కేసులో హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రయివేటు కంపెనీకి అప్పగించిన భూమికి బాధ్యులైన వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు. ఏకపక్షంగా భూముల బదలాయింపు కేసులో ప్రభుత్వమే దోషి అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిందన్నారు. చట్టం తెచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. వాదనల అనంతరం తదుపరి విచారణను ధర్మాసనం 28కి వాయిదా వేసింది.
Dhoni : క్రికెట్ వదిలి ఈ వ్యాపారంలో కోట్లు గడిస్తోన్న ధోనీ
తాజావార్తలు
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!