G. Kishan Reddy: బీజేపీ తెలంగాణ ప్రజలకు గుండె చప్పుడై ప్రజల కోసం పనిచేస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు ఆరంభం మాత్రమే అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ తమ ఉనికిని కోల్పోయిందన్నారు. బీఆర్ఎస్ 14 చోట్ల 3వ స్థానానికే పరిమితమైందని తెలిపారు. 8 చోట్ల డిపాజిట్లు కోల్పోయిందన్నారు. ఖమ్మం, మహబూబాబాద్ తప్ప మిగిలిన చోట్ల మూడో, నాలుగో స్థానానికి పడిపోయిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్థానాలు గెలిచిన చోట్ల కూడా ఈసారి ఓట్లు తగ్గాయన్నారు. ఆయా స్థానాల్లో బీజేపీ పుంజుకుందన్నారు. విద్యావంతులు, కవులు, ఉద్యమకారుల ఆకాంక్ష కూడా ఇదే అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మేం 8 చోట్ల గెలిచామన్నారు. మరో 6 చోట్ల రెండో బలమైన ప్రత్యామ్నాంగా నిలిచామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో మా పార్టీ అభ్యర్థి డీకే అరుణ గెలిచారని అన్నారు.
Read also: Gold Price Today: పసిడి ప్రియులకు భారీ షాక్.. తులం బంగారంపై రూ.770 పెరిగింది!
రేవంత్ రెడ్డి సామ, భేద, దాన, దండోపాయాలు ప్రయోగించినా.. మా అభ్యర్థిపై అసభ్య పదజాల ప్రయోగించినా.. బీజేపీ కార్యకర్తలను బెదిరించినా.. ప్రజలు బీజేపీకే పట్టం గట్టారని తెలిపారు. గతంలో రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన.. మల్కాజ్‌గిరిలో మా..ఈటెల గారు దాదాపు 3.5 లక్షల మెజారిటీతో గెలిచారని పేర్కొన్నారు. కాంగ్రెస్ తొండి అట ఆడిందని, బీజేపీ పై తప్పుడు ప్రచారాలు చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ముసుగులో మజ్లిస్ పార్టీ సికింద్రాబాద్ లో పోటీ చేసిందన్నారు. నాంపల్లి నియోజకవర్గాన్ని గమనిస్తే.. ఈ విషయం స్పష్టమవుతుందన్నారు. తెలంగాణలో బీజేపీ రాజకీయ ప్రత్యామ్నాయంగా మారిందన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ తెలంగాణ ప్రజలకు గుండె చప్పుడై ప్రజల కోసం పనిచేస్తుందన్నారు.
Teachers Transfer: టీచర్ల బదిలీలకు బ్రేక్.. ఉత్తర్వులు నిలిపివేత