Ganja Seized: డ్రగ్స్ ముఠాల ఆటకట్టిస్తున్నారు పోలీసులు. సినిమాటిక్ రేంజ్‌లో రాష్ట్రవ్యాప్తంగా మెరుపుదాడులు చేశారు. కొన్ని గంటల్లోనే ఏకంగా 500 కిలోల గంజాయి, పెద్ద ఎత్తున్న ఇతర మాదకద్రవ్యాలు పట్టుకున్నారు పోలీసులు. ఈగల్ టీమ్… జీఆర్పీ.. ఆర్పీఎఫ్.. ఎక్సైజ్.. లా అండ్ ఆర్డర్.. ఇలా అన్ని విభాగాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. మాదకద్రవ్యాల రవాణా ముఠాల తాటతీశాయి. గంజాయి, డ్రగ్స్ రవాణా ముఠాలు రెచ్చిపోతున్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పెడుతున్నా.. పైఎత్తులు వేస్తూ రకరకాల మార్గాల్లో రవాణా…
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్ ముఠాలపై పోలీసులు దాడులు మరింత వేగవంతం చేశారు. ఈగిల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్, లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లలో భారీగా డ్రగ్స్ స్వాధీనం అయ్యాయి.
Delhi Airport: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా గంజాయి పట్టుకున్నారు. విదేశీ మూలాలు కలిగిన ఈ డ్రగ్స్ థాయిలాండ్ నుంచి అక్రమంగా దేశంలోకి తరలించడానికి ప్రయత్నించగా, అధికారులు అప్రమత్తతో దీన్ని అడ్డుకున్నారు. ఈ ఘటనలో మొత్తం 63 కోట్ల రూపాయల విలువ చేసే 60 కేజీల గంజాయిను సీజ్ చేశారు. గంజాయిని లగేజ్ బ్యాగ్ లో అత్యంత చాకచక్యంగా దాచిన స్మగ్గలర్స్, దాన్ని సాధారణ ప్రయాణికుల లగేజ్ లాగా పంపించేందుకు యత్నించారు. Read Also:…
Ganja Seized : మెదక్ జిల్లా మొగుడంపల్లి మండలం మాడిగిలోని ఆర్‌టీఏ చెక్‌పోస్ట్ వద్ద 800 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంబైకి భారీ ఎత్తున గంజాయి తరలిస్తుండగా, పూణె , గోవా రాష్ట్రాల డిఆర్‌ఐ స్పెషల్ ఫోర్స్ అధికారులు లారీని వెంబడించి పట్టుకున్నారు. తమను పోలీసులు వెంబడిస్తున్నట్లు గమనించిన లారీ డ్రైవర్ చాకచక్యంగా చెక్‌పోస్ట్ వద్ద లారీ ఆపి, కాగితాలు చూపించిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. లారీ వద్ద ఉన్న డిఆర్‌ఐ అధికారులు…
Ganja Seized : కార్వాన్ టోలీ మజీద్ ప్రాంతంలో ఒక ఇంట్లో గంజాయి అమ్మకాలు జరుపతున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీస్‌లు, ఎస్టీఎప్ టీం సభ్యులు తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం జరిపిన దాడుల్లో అలీంఖాన్ అనే వ్యక్తి ఇంట్లో నలుగురు యువకులు గంజాయి అమ్మకాలు జరుపుతుండగా పట్టుకున్నారు. నలుగురి వద్ద 2.1 కేజీల గంజాయిని లభించింది. వారు గంజాయిని అమ్మకాలకు తీసుక వెళ్లె నాలుగు బైకులను, ఆరు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, బైకుల, సెల్…
హైదరాబాద్‌లోని ఫతేనగర్ ప్రాంతంలో ఒక మహిళ గంజాయి ప్యాకెట్లు అమ్మకాలు జరుపుతుండగా ఎస్‌ఎఫ్‌టీ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా ఫతేనగర్‌లో షేక్‌జామీన్ బీ అనే మహిళ గంజాయిని అమ్మకాలు సాగిస్తోంది.
కొత్తగూడెంలో అక్రమంగా తరలిస్తున్న భారీ గంజాయిని గురువారం పోలీసులు పట్టుకున్నారు. రూ. 1.62 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా.. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ ఎస్కే అబ్దుల్ రెహమాన్ మీడియాతో మాట్లాడుతూ పట్టణ శివార్లలోని రేగళ్ల క్రాస్‌రోడ్‌లో సాధారణ వాహనాల తనిఖీల్లో ఈ విషయం బయటపడిందని వెల్లడించారు. ట్రక్కులో ప్రత్యేకంగా నిర్మించిన చాంబర్‌లో 650 కిలోల గంజాయిని గుర్తించామని తెలిపారు. అరెస్టయిన వ్యక్తులు ట్రక్కు డ్రైవర్ సుందర్ రామ్, లారీ క్లీనర్…
హైదరాబాద్ రాజేంద్రనగర్ లో భారీగా గాంజాయి పట్టుకున్నారు పోలీసులు. వైజాగ్ నుండి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర తరలిస్తున్న 45 కేజీల గాంజాయి సీజ్ చేసింది క్రైమ్ టీమ్. విశ్వసనీయ సమాచారం మేరకు రాజేంద్రనగర్ చింతల్ మెట్ చౌరస్తా లో కాపు చేసారు క్రైమ్ టీమ్ పోలీసులు… ఓ కారును అడ్డగించి తనిఖీలు చేసిన కాప్స్ కారు డిక్కిలో గాంజాయి గుర్తించారు. పోలీసులను చూసి కారును వదలి పారిపోయే యత్నం చేసిన కేటుగాళ్లు. పారిపోతున్న దుండగులను వెంబడించి పట్టుకున్నారు…
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి, డ్రగ్స్ కేసులు కలకలం రేపుతున్నాయి. మేడ్చల్ జిల్లాలో భారీగా మెపిడ్రెన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రూ. రెండు కోట్ల విలువగల డ్రగ్ స్వాధీనం చేసుకోవడంతో నగరం ఉలిక్కిపడింది. 4.92 కేజిలతో పాటు, ఓ కార్ సీజ్ చేశారు పోలీసులు. ముగ్గురు నిందితులు పవన్,మహేష్ రెడ్డి,రామకృష్ణగౌడ్ ను అరెస్ట్ చేశారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ప్రధాన నిందితులు ఎస్క్ రెడ్డి, హన్మంత్ రెడ్డి పరారీలో ఉన్నట్టు పోలీసులు…
మత్తు పదార్థాలు పట్టివేత అనే వార్తను మనం తరచుగా వింటూ ఉంటాము. వాహనాల్లోనో, లేదంటే ఇతర ప్రాంతాల్లోనో అధికారులు దాడులు నిర్వహించి నిందితులను పట్టుకుంటారు. అయితే తాజాగా జైపూర్ అంతర్జాతీయ పోస్టాఫీసు లో గాంజా దొరకడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అమెరికా నుండి జైపూర్ వచ్చిన పార్శిల్ లో 1.5 కోట్ల విలువ చేసే 9 కేజీల గాంజాను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బ్రాండెడ్ బట్టల పార్శిల్ లో…