బీట్రూట్.. దీని శాస్త్రీయనామం బీటా వల్గారీస్. ఇది చెనోపొడియేసి కుటుంబానికి చెందినది. ఇది పుష్పించే మొక్కలలో ద్విదళ బీజాలకు చెందిన ఒక రకమైన మొక్క. దీన్ని వేరు రూపాంతరంగా పెరిగే దుంపల కోసం పెంచుతుంటారు. ఈ బీటు దుంపలను కూరగాయగా చక్కెర తయారీ కోసం మరియు పశుగ్రాసంగా కూడా ఉపయోగిస్తారు. ఈ మొక్కలలో మూడు ఉపజాతులు కూడా ఉంటాయి. ఈ బీట్‌రూట్ ఆహారంలో భాగం చేసుకోవడం వలన చాలా లాభాలు ఉంటాయి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : Tech Tips : మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ సేపు ఉండాలంటే ఇలా చేయండి
అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారు బీట్‌రూట్ రసాన్ని తాగండి. ఎందుకంటే ఇది అధిక రక్తపోటును బాగా తగ్గిస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇందులోని నైట్రేట్లు రక్తంలో కలిసాక నైట్రిక్ యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ వాయువు రక్తనాళాలలను వ్యాకోచించి రక్తపోటు తగ్గించి ఇందుకు దోహదం చేస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది. కాబట్టి రోజు రెండు వందల యాబై మిల్లీ గ్రాముల పచ్చి బీట్రూట్ రసాన్ని తాగితే మేలు జరుగుతుంది. బీట్‌రూట్ కేవలం నైట్రేట్‌లు మాత్రమే కాదు, విటమిన్లు, ఖనిజాలు అమైనో ఆమ్లాలు సైతం ఉంటాయి.
Also Read : Health Tips: చలిలో వాకింగ్ చేస్తున్నారా? అయితే మీకు ఈ వ్యాధి రావడం ఖాయం
శరీరం కాలుష్యాన్ని వినియోగించుకోవటంలో తోడ్పడే సైల్యూష్యం సైతం ఉంది. బీట్‌రూట్ కు ఎరుపు రంగుని కలి తగ్గించే బీటా సయానిన్‌కు పెద్ద ప్రేగులో కాన్సర్‌తో పోరాడే లక్షణం ఉంటుంది. అంతే కాదు షుగర్ ఉన్నవాళ్లలో లివర్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. తరచూ బీట్‌రూట్ తినడం వల్ల మీ లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. అంతే కాదు బీట్‌రూట్ తినడం వలన శరీరంలో కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. బీట్‌రూట్ రసం రక్తపోటును తగ్గిస్తుంది. ఈ బీట్‌రూట్‌లో పోరాన్ ఎక్కువగా ఉన్నందున సెక్స్ హర్మోన్స్ ఎక్కువగా విడుదల చేస్తుంది. అంతేకాదు బీట్‌రూట్ రెగ్యులర్‌గా తీసుకోవడం కొంతవరకు క్యాన్సర్ నివారణకు కూడా ఉపయోగపడుతుందని పరిశోధనలో తేలింది.