Sangareddy: విద్యార్థుల కోసం తపన.. హెడ్ మాస్టర్ వినూత్న నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాఠశాలకు చుట్టం చూపుగా వచ్చే హెడ్ మాస్టర్లను మనం ఇప్పటి కాలంలో చూస్తుంటాం. పిల్లలు వచ్చారా చదువుకుంటున్నారా అనే వారి కన్నా.. మనం వెల్లి బడిని అలా చుట్టం చూపుగా చూసుకుని వద్దాంలే మనకెందుకు అనే వారే ఎక్కువ ఈ కాలంలో.. ప్రభుత్వం నుంచి జీతం పడిందా అంతే .. ఇది మనం చూస్తున్న తంతు.. అయితే దీనికి విరుద్దంగా ఓహెడ్ మాస్టర్ పిల్లలపై చూపిన అభిమానం అందరిని ఆకట్టుకుంటోంది.
పిల్లల్ని బడికి పంపాలని ఆ హెడ్ మాస్టర్ పిల్లల తల్లి దండ్రులను ఒప్పించిన తీరు అందరిని మనసు కరిగించేలా చేసింది. బడి మానేసిన పిల్లలను బడికి పంపేవరకూ తిరిగి వెళ్లేదేలేదంటూ వాళ్ల ఇళ్ల వద్ద ప్రధానోపాధ్యాయుడు నేలపై పడుకొని వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ తల్లిదండ్రులను వేడుకున్నారు. వారి ఇంటిముందే నిరసన తెలిపి తల్లిదండ్రుల అభిమానాన్ని గెలిచి పిల్లలను బడితీసుకెళ్లాడు ఆ హెడ్ మాస్టర్. ఇలాంటి హెడ్ మాస్టర్లు నూటికో కోటికో ఒక్కరు వుంటారు.. అందులో ఈ హెడ్ మాస్టర్ కూడా ఒకరనే చెప్పచ్చు. ఈ వినూత్న నిరస ఘటన సంగా రెడ్డి జిల్లా పుల్కల్ మండలం ముదిమాణిక్యం గ్రామంలో చోటుచేసుకున్నది.
Also Read
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
- Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
- Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్‌తో స్పెషల్ మీట్
- Hyderabad Pan Masala Raid: హైదరాబాద్‌లో పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్..
బడిబాట కార్యక్రమంలో భాగంగా ముదిమాణిక్యం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల హెచ్ఎం నూలి శ్రీధర్రావు సహచర ఉపాధ్యాయులను వెంట బెట్టుకుని బడి మానేసిన పిల్లల ఇళ్లకు వెళ్లారు. 2021-22 విద్యా సంవత్సరంలో ఎనిమిదో తరగతి పూర్తి చేసిన అన్నదమ్ములు ప్రస్తుత విద్యా సంవత్సరంలో తొమ్మిదో తరగతిలో చేరాల్సి ఉంది.
అయితే అందులో ఒకరు బాల కార్మికుడిగా మారగా, మరొకరు అనారోగ్యంతో పాఠశాలలో చేర లేదు. వీరితో పాటుగా ఏడో తరగతి పూర్తి చేసుకుని ఎనిమిదో తరగతిలో చేరాల్సిన మరో విద్యార్థి కూడా బడి మానేశాడు. దీంతో హెచ్ఎం శ్రీధర్రావు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బడికి వచ్చేలా కౌన్సెలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులు ఎంతకీ వినకపోవడంతో.. ఎండలో కటిక నేలపై కూర్చుని, పడుకుని వినూత్న రీతిలో వారిని వేడుకొన్నారు. చివరకు పిల్లలను తిరిగి పాఠశాలకు వచ్చేలా చేశారు. దీంతో హెచ్ఎం శ్రీధర్రావును గ్రామస్తులు ప్రశంసించారు.
సర్కారు స్కూళ్లను బలోపేతం చేయటం, అడ్మిషన్ల సంఖ్యను గణనీయంగా పెంచటమే లక్ష్యంగా చేపట్టిన ప్రొఫెసర్ జయంశంకర్ బడిబాట కార్యక్రమం జూన్ 3 నుంచి ప్రారంభమైంది. ఈ ఏడాది విద్యార్థుల నమోదుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కాగా..బడిబాటలో కార్యక్రమంలో భాగంగా పిల్లలు బడికి రప్పించే బాధ్యతను స్కూల్ హెడ్ మాస్టర్లకు అప్పగించింది. దీంతో పిల్లలను బడికి రప్పించాలనే సదుద్దేశ్యంతో ఈ హెడ్ మాస్టర్ చేసిన నిరసన అందరికి నిదర్శనం చెప్పొచ్చు.
తాజావార్తలు
-
Best Mileage Bikes: లీటర్‌కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
-
YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
-
TMC Rebel MPs: 20 మంది TMC రెబల్ ఎంపీలకు షాక్.. అనర్హత పిటిషన్‌పై స్పీకర్ కీలక చర్య
-
Ram Charan: రవితేజ ‘ఇరుముడి’కి రామ్ చరణ్ అభినందనలు.. స్వామి శరణం అంటూ!
-
Kriti Sanon: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం.. దెబ్బకి యాడ్ వీడియో డిలీట్
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!