Kriti Sanon: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం.. దెబ్బకి యాడ్ వీడియో డిలీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kriti Sanon GIVA Raksha Bandhan Ad Controversy: బాలీవుడ్ హాట్ బ్యూటీ కృతి సనన్, ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ ‘ గివా’ కలసి చేసిన రక్షాబంధన్ ప్రకటన ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపింది. దీంతో గివా ఆ యాడ్‌ను తొలగించింది. వాస్తవానికి.. పండగ నేపథ్యంలో తీసుకొచ్చిన ఈ అడ్వర్టైజ్మెంట్లో కృతి సనన్ ధరించిన దుస్తులపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సాంప్రదాయ పండుగలో బ్రాస్లెట్ మోడల్ బ్రాలెట్ బ్లౌజ్, కేప్, డ్రేప్డ్ స్కర్ట్ ధరించి రాఖీ కట్టడం ఏంటంటూ నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. ఈ వివాదంలోకి నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కూడా ఎంట్రీ ఇచ్చి కృతిపై సెటైర్లు వేశారు. రక్షాబంధన్ వంటి పవిత్రమైన పండుగను “బికీనీ” లాంటి దుస్తుల్లో జరుపుకోవడమేంటని ఆమె ప్రశ్నించడంతో ఈ రచ్చ మరింత ముదిరింది.
ఈ వివాదంపై కృతి సనన్ గట్టిగానే స్పందించింది. పండుగలు అనేవి మనసులోని భావోద్వేగాలు, సంప్రదాయాలకు సంబంధించినవని, ఒక మహిళ వేసుకునే దుస్తుల నెక్ లైన్‌ను బట్టి ఆమె సంస్కృతిని అంచనా వేయలేమని కౌంటర్ ఇచ్చింది. “సంస్కృతీ సంప్రదాయాలు మనసులో ఉంటాయి తప్ప నెక్ లైన్లో కాదు” అంటూ ఘాటుగా రాసుకొచ్చింది. అంతేకాకుండా, ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులు కూడా కుటుంబంలో భాగమేనని, గివా యాడ్‌లో వాటికి రాఖీ కట్టే కాన్సెప్ట్ తనకు ఎంతో నచ్చిందని, అందుకే ఈ ప్రచారంలో భాగమయ్యానని ఆమె స్పష్టం చేసింది. ఈ వివాదం పెద్దదవుతుండటంతో గివా బ్రాండ్ యాజమాన్యం తక్షణమే స్పందించింది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల పట్ల తమకు అత్యున్నత గౌరవం ఉందని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది. పండుగ సంతోషాన్ని కుటుంబంతో పాటు పెంపుడు జంతువులకు కూడా విస్తరించాలనే ఉద్దేశంతోనే ఈ యాడ్ తీశామని, ఎవరి భావాలనైనా గాయపరిచి ఉంటే క్షమించాలని కోరింది. ఎవరి మనోభావాలనూ దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేస్తూ, అందరి గౌరవార్థం ఆ వివాదాస్పద ప్రకటనను అన్ని సోషల్ మీడియా వేదికల నుండి పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
Also Read
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
తాజావార్తలు
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!