Harish Rao: కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది.. బడ్జెట్‌లో వాటికి రూపాయి ఇవ్వలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao Responds On Central Budget 2023: ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తెలంగాణ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఈ బడ్జెట్ తీవ్ర నిరాశను మిగిల్చిందని, తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. ఏ ఒక్క వర్గానికి కూడా మేలు చేయలేదని పేర్కొన్నారు. రైతులు, రైతు కూలీలు, ఉపాధి హామీ కూలీలు, మహిళలు, విద్యార్థుల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం చేశారన్నారు. గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీకి, ఎన్నికలు జరగబోయే కర్ణాటకు మాత్రమే వరాలిచ్చి.. తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన హామీలో ఉన్న గిరిజన యూనివర్సిటీ, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, ఇండస్ట్రీయల్ కారిడార్, ఇండస్ట్రీయల్ ఇన్సెటివ్స్, మెగా టెక్స్టైల్, ఫార్మా సిటీ మొదలైన వాటి గురించి తాము అడుగుతూనే ఉన్నామని.. అయితే కేంద్రం వాటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపారు.
Cycling: సైక్లింగ్‌తో క్యాన్సర్ దూరమవుతుందా? నిజమెంత?
Also Read
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Off The Record: తెలంగాణలో అధికారమే లక్ష్యం.. సింగరేణి నుంచే ఆపరేషన్ మొదలు?
- Pawan Kalyan: రేపు హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
- Shiv Charan Reddy: 'నన్ను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు'.. మనసులు నొప్పించి ఉంటే క్షమించండి: శివచరణ్ రెడ్డి
కేంద్రప్రభుత్వం ఉపాధి కూలీల పొట్ట కొట్టిందని.. ఇది చాలా బాధాకరమని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 30 వేల కోట్లు కోత పెట్టారని.. అలాగే ఫెర్టిలైజర్ సబ్సిడీ విషయంలో రూ.50 వేల కోట్లు కోత పెట్టారని ఆరోపించారు. పత్తి కొనుగోలు నుండి కేంద్రం తప్పుకుందా అని అనుమానం కలుగుతుందని సందేహం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం సీసీఐకి పత్తి కొనుగోలు విషయంలో బడ్జెట్‌లో పూర్తి స్థాయిలో కోత పెట్టారని వెల్లడించారు. గతంలో 157 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇచ్చిన కేంద్రం.. తెలంగాణకు మాత్రం అన్యాయం చేసిందని, రాష్ట్రానికి ఒక్క ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని అన్నారు. నర్సింగ్ కాలేజీ ఏర్పాటులో కూడా మొండి చేయి చూపారన్నారు. తెలంగాణ పట్ల బీజేపీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందన్నారు. అసలు తెలంగాణకు ఏమిచ్చారు? రాష్ట్రానికి ఎందుకు ఇవ్వడం లేదు? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
Mytri Movie Mekars: మరో ‘వార్’ కన్ఫామ్ రా.. ఫిక్స్ చేసేసుకోండి
తెలంగాణ రాష్ట్రానికి, రైతులకు, రైతు కూలీలకు అన్యాయం చేశారని.. ఇది అందరినీ తీవ్ర నిరాశను మిగిల్చిందని హరీశ్ రావు వాపోయారు. పెట్రోల్, డీజిల్‌పై సెస్‌తో పాటు గ్యాస్ సిలిండర్ ధర తగ్గిస్తారేమోనని అనుకున్నామని.. అలాగే పేద మధ్యతరగతి మహిళలకు ఏదైనా శుభవార్త చెప్తారేమోనని భావించామని.. కానీ చివరకు నిరాశే మిగిలిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పూర్తిగా రైతు వ్యతిరేక బడ్జెట్, నిరుద్యోగుల వ్యతిరేక బడ్జెట్, మహిళల వ్యతిరేక బడ్జెట్, రైతు కూలీల వ్యతిరేక బడ్జెట్ అని ఆరోపించారు.
Rajagopal Reddy: ఓటమి భయంతోనే కేసీఆర్ తన పార్టీ పేరు మార్చారు
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!