తెలంగాణ గొల్ల, కురుమల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇబ్రహీం పట్నం మన్నేగూడలో యాదవ – కురుమ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. నవంబర్ 3 తర్వాత గొర్రెల పంపిణీ ని ఎవరూ అడ్డుకోలేరు అన్నారు మంత్రి తలసాని. మేలు చేసిన కేసీఆర్ ప్రభుత్వంకు అండగా నిలబడాలని కోరుతున్నా అన్నారు. గొల్ల కురుమల ప్రతిపాదనలను కేసీఆర్ దృష్టికి తీసుకెళతామని హామీ ఇస్తున్నానన్నారు తలసాని.
Read Also: Tollywood : ఈ వారం చిన్నసినిమాల సందడి!
మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. మాట తప్పని వాళ్ళు … మడమ తిప్పని వాళ్ళు గొల్ల కురుమలు. గొల్ల కురుమలు ధర్మం వైపు ఉంటారు. చంద్రబాబు నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వరకు గొర్రెల స్కీమ్ కు గ్యారంటీ ఇవ్వలేదు. కానీ 75 శాతం సబ్సడీతో గొర్రెల పంపిణి కేసీఆర్ చేస్తున్నారు. చట్ట సభల్లో గొల్ల కురుమలకు రాజకీయ ప్రాధాన్యత కేసీఅర్ ఇచ్చారన్నారు మంత్రి హరీష్ రావు. గొర్రెల స్కీమ్ ను చూసి ఇతర రాష్ట్రాల వారు కూడా ప్రశంసిస్తున్నారు. ఇటీవల కర్నాటక మంత్రి ఒకరు గొర్రెల స్కీం దేశంలో ఎక్కడా లేదన్నారు.
బీజేపీ బీసీ కోసం కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టమని అంటే పెట్టలేదు.. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఏమీ చేయవు…కానీ కేసీఅర్ చేసే పనులను ఆపుతారు.. గొర్రెల డబ్బులు రావని ప్రచారం చేస్తున్నారు.. కేసీఅర్ కరెంటు బాధలు లేకుండా చేస్తున్నారు. బీజేపీ కేంద్రంలో చేసింది ఏంలేదన్నారు మంత్రి తలసాని. ఝుటా మాటలు మాట్లాడే వారిని నమ్మవద్దన్నారు మంత్రి హరీష్ రావు. శ్రీకృష్ణుడు ఎలా న్యాయం వైపు నిలబడ్డారో మీరు కూడా ఇప్పుడు అలా నిలబడాలి. కొమరవెల్లి ఆలయాన్ని అభివృద్ధి చేసింది కేసీఅర్ మాత్రమే. 11 వేల కోట్లతో గొర్రెల పంపిణీ చేస్తున్నారు కేసీఅర్. కేంద్ర మంత్రి రూపాల తెలంగాణ రాష్ట్ర పథకాలను ప్రశంసించారు. గిరిరాజ్ సింఘ్ కూడా పశువుల అంబులెన్స్ స్కీమ్ ను ప్రశంసించారు. మీ కోసం పనిచేస్తున్న ప్రభుత్వం కు అండగా ఉండాలని కోరుతున్నారు. దొడ్డి కొమురయ్య జయంతి,వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తాం అన్నారు మంత్రి కేటీఆర్.
Read Also: పులిపిర్లకు చెక్ పెట్టండిలా..