Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
- సన్నబియ్యం ధరలు నాలుగు నెలల్లో 25 శాతం పెరిగాయన్న హరీష్ రావు
- రైతుకు గిట్టుబాటు లేదు.. వినియోగదారుడికి అందుబాటు లేదని విమర్శ
- ఉల్లిపాయ, వెల్లుల్లి, పప్పుల ధరలపై ప్రభుత్వాన్ని నిలదీత
- బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలపై తక్షణ తనిఖీలకు డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతూ సామాన్య పౌరుడి నడ్డి విరుస్తుంటే, వాటిని అదుపు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు విమర్శించారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రభుత్వంపై విరుచుకుపడిన ఆయన, పౌరసరఫరాల శాఖ పర్యవేక్షణా రాహిత్యానికి సామాన్య ప్రజలే మూల్యం చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే సన్నబియ్యం ధరలు ఏకంగా 25 శాతం పెరగడం ప్రభుత్వ వైఫల్యానికి స్పష్టమైన నిదర్శనమని మండిపడ్డారు. రికార్డు స్థాయిలో పంట దిగుబడి సాధించామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం, ఉత్పత్తి పెరిగినప్పుడు మార్కెట్లో బియ్యం ధరలు ఎందుకు ఆకాశాన్ని అంటుతున్నాయో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ప్రభుత్వం రేషన్ ద్వారా ఇస్తున్న నాణ్యత లేని సన్నబియ్యాన్ని ప్రజలు వినియోగించడం లేదనడానికి, బయట మార్కెట్లో బియ్యం ధరలు అదుపు తప్పడమే ప్రధాన సాక్ష్యమని వ్యాఖ్యానించారు.
రైతుకు గిట్టుబాటు లేదు.. వినియోగదారుడికి అందుబాటు లేదు
ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతన్నకు మద్దతు ధర పేరిట నామమాత్రపు ధర మాత్రమే దక్కుతుంటే, మధ్యదళారులు మాత్రం క్వింటాకు రూ.8,000 పైమాటే లాభపడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. రైతుకు గిట్టుబాటు ధర దక్కక, ఇటు వినియోగదారుడికి అందుబాటు ధరలో సరుకులు అందక తీవ్ర అవస్థలు పడుతుంటే కేవలం మధ్యవర్తులు మాత్రమే కోట్లు కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు. కళ్లముందే ఈ దోపిడీ జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం శోచనీయమన్నారు. బియ్యం మాత్రమే కాకుండా ఉల్లిపాయలు రూ.70, వెల్లుల్లి రూ.240, పల్లి నూనె రూ.210, పెసరపప్పు రూ.125, కందిపప్పు రూ.165 కు చేరుకోవడంతో సామాన్య కుటుంబాల వంటింటి బడ్జెట్ పూర్తిగా తలకిందులైందని తెలిపారు.
Also Read
- CM Revanth Reddy : కోటి ఓట్లు.. 90 సీట్లు మా టార్గెట్..
- Hyderabad News : హైదరాబాద్ ఉగ్రదాడి బెదిరింపు మెయిల్ ఫేక్.. నిర్ధారించిన పోలీసులు
- TGSRTC: టెక్నాలజీ వాడకంలో టీజీఎస్ఆర్టీసీ నయా రికార్డ్.. బస్సులో "i-ALERT" కన్ను..
- CM Convoy : సీఎం రేవంత్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం.. చదర్ఘాట్ బ్రిడ్జి వద్ద అడ్డుపడ్డ ఎద్దు
బ్లాక్ మార్కెటింగ్‌పై తక్షణమే దాడులు చేయాలని డిమాండ్
ధరల పర్యవేక్షణను గాలికి వదిలేసి ప్రభుత్వం కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తోందని హరీష్ రావు మండిపడ్డారు. వ్యాపారులు సృష్టిస్తున్న కృత్రిమ కొరత, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ , అధిక మార్జిన్లపై తక్షణమే తనిఖీలు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని సన్నబియ్యం సహా అన్ని నిత్యావసరాల ధరలకు అడ్డుకట్ట వేసి, పెరుగుతున్న ధరల భారం నుంచి సామాన్యుడికి ఉపశమనం కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్‌గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్‌కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!