Harish Rao : కాంగ్రెస్ సర్కార్‌ది ఎగవేతల పాలన.. రైతులకు అడుగడుగునా దగా
- కాంగ్రెస్ బడ్జెట్‌పై హరీష్ రావు ఘాటు విమర్శలు
- రైతు బంధు నిధుల ఎగవేత ఆరోపణలు
- బోనస్, బీమా అమలుపై ప్రశ్నలు
- నిరుద్యోగ హామీలపై ప్రభుత్వాన్ని నిలదీత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ చర్చలో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రస్తుత బడ్జెట్ ప్రసంగంలో ప్యూరిటీ (Purity), క్లారిటీ (Clarity), షూరిటీ (Surety) ఏమీ లేవని, ఇది కేవలం అంకెల గారడీ అని ఆయన విమర్శించారు. రైతులు, రైతు కూలీలు, నిరుద్యోగులను ఈ ప్రభుత్వం ఏ రకంగా వంచిస్తోందో హరీష్ రావు గణాంకాలతో సహా వివరించారు.
మేనిఫెస్టోలో ప్రతి ఎకరానికి రూ. 15,000 ఇస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలో తొక్కారని హరీష్ రావు మండిపడ్డారు. గత వానకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి రైతులకు రావాల్సిన దాదాపు రూ. 19,000 కోట్ల రైతు బంధు నిధులను ప్రభుత్వం ఎగ్గొట్టిందని ఆరోపించారు. “కుడి చేత్తో రైతు బంధు నిధులను లాగేసుకొని, ఎడమ చేత్తో రుణమాఫీ చేశామని చెప్పడం రైతులను మోసం చేయడమే” అని ఆయన విమర్శించారు. కేసీఆర్ ది ‘పెట్టుబడి సాయం’ పథకమైతే, కాంగ్రెస్ ది ‘ఎన్నికల పెట్టుబడి సాయం’ (Election Investment Support) అని ఎద్దేవా చేశారు.
Also Read
- Adilabad RIMS Fire : రిమ్స్ విషాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.!
- Food Safety : ఎక్స్పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. దిల్ బహార్ యూనిట్‌పై ఎస్వోటీ దాడి
- Janasena Party: జనసేన తెలంగాణలో కొత్త కమిటీ.. జాయినింగ్ కమిటీ కన్వీనర్‌గా ప్రేమ్ కుమార్
- Ganesh Visarjan : గణేష్ నిమజ్జనానికి సెలవు.. ఆ రోజు మాత్రం పని.!
వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పి, దానిని కేవలం సన్న రకాలకే పరిమితం చేశారని, అది కూడా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని హరీష్ రావు దుయ్యబట్టారు. అలాగే, ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా’ పథకం కింద రైతులకు పూర్తి రక్షణ కల్పిస్తామని బడ్జెట్‌లో రూ. 1,300 కోట్లు కేటాయించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఒక్క రైతుకు కూడా బీమా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
PM Modi: కరోనాను ఎదుర్కొన్నట్లే.. ఈ సంక్షోభాన్ని జయిస్తాం.. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోడీ వ్యాఖ్య
భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ. 12,000 ఇస్తామని ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పేరుతో గొప్పగా ప్రకటించి, రెండు బడ్జెట్‌లు గడిచినా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని హరీష్ రావు విమర్శించారు. “ఇందిరా గాంధీ పేరు పెట్టుకొని నిరుపేద కూలీల కడుపు కొట్టడం ధర్మమేనా?” అని ఆయన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను ప్రశ్నించారు.
మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని, తాజా బడ్జెట్‌లో ‘జాబ్ క్యాలెండర్’ ప్రస్తావనే లేకపోవడం దారుణమని హరీష్ రావు అన్నారు. ఉద్యోగాల కోసం ఆందోళన చేస్తున్న అశోక్ నగర్ అభ్యర్థులపై లాఠీచార్జీ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ కవితను పేరడీ చేస్తూ.. “రాహుల్ గాంధీ మాటలు నమ్మి.. కాంగ్రెస్ కు ఓటేసిన నిరుద్యోగికి ఎంత కష్టం.. ఎంత కష్టం..” అంటూ నిరుద్యోగుల దీన స్థితిని సభలో వినిపించారు.
ప్రభుత్వం ఇప్పటికైనా అంకెల గారడీ మానుకొని, రైతులకు బకాయి పడ్డ నిధులను విడుదల చేయాలని, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
PM Modi: కరోనాను ఎదుర్కొన్నట్లే.. ఈ సంక్షోభాన్ని జయిస్తాం.. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోడీ వ్యాఖ్య
తాజావార్తలు
-
Gautam Gambhir: సంజు శాంసన్ విషయంలో తప్పు చేశా.. ఆ రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు..
-
AP Heavy Rain Alert: తీరంవైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. దంచికొడుతున్న వానలు..
-
Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
-
Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
-
Horoscope : రేపు శుభ యోగాలు.. ఈ 6 రాశులకు అదృష్టమే అదృష్టం
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!