నిన్న అట్టహాసంగా వరంగల్‌లో కాంగ్రెస్ నిర్వహించిన రైతు సంఘర్షణ సభపై టీఆర్ఎస్ మంత్రలు వరుస పంచ్‌లు వేస్తున్నారు. తాజాగా ట్విటర్ మాధ్యమంగా మంత్రి హరీశ్ రావు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ‘‘రాహుల్ గాంధీగారూ, వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రమైన పంజాబ్ రైతాంగమే మిమ్మల్ని ఈడ్చి తన్నింది. పంజాబ్ రైతులు నమ్మని మీ రైతు డిక్లరేషన్ – చైతన్యవంతులైన తెలంగాణ రైతులు నమ్ముతారా? ఇది రాహుల్ సంఘర్షణ సభ – రైతు సంఘర్షణ సభ కాదని తెలంగాణ ప్రజానీకం భావిస్తున్నారు’’ అని ట్వీట్ చేశారు.
ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత ఏం మాట్లాడాలి, సభ దేని గురించి అని అడిగిన రాహుల్ గాంధీకి.. తెలంగాణ రైతుల గురించి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందని మరో ట్వీట్లో ఎద్దేవా చేశారు. ఎప్పటికీ తెలంగాణలోని సబ్బండ వర్గాల సంక్షేమం గురించి నిరంతరం పనిచేసే ఏకైక పార్టీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ మాత్రమేనని హరీశ్ రావు అన్నారు.
కాగా.. రైతు సంఘర్షణ సభలో భాగంగా తెలంగాణ రైతుల్ని టీఆర్ఎస్ మోసం చేస్తోందని, ఎందరో త్యాగాలతో ఏర్పాడిన తెలంగాణ రాష్ట్రంలో బాగుపడింది కేవలం ఒక్క కుటుంబమేనని రాహుల్ గాంధీ విమర్శించిన సంగతి తెలిసిందే! తమ హయాంలో రైతుల కోసం ఎన్నో పనులు చేశామని, టీఆర్ఎస్ మాత్రం వాటన్నింటినీ రద్దు చేసి కేవలం రైతు బంధు పేరుతో డప్పు కొట్టుకుంటోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ మంత్రులు తిరిగి ఎటాక్‌కి దిగారు.
<blockquote class=”twitter-tweet”><p lang=”te” dir=”ltr”>రాహుల్ గాంధీ గారూ, వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రమైన పంజాబ్ రైతాంగమే మిమ్మల్ని ఈడ్చి తన్నింది.<br>పంజాబ్ రైతులు నమ్మని మీ రైతు డిక్లరేషన్ – చైతన్యవంతులైన తెలంగాణ రైతులు నమ్ముతారా? ఇది రాహుల్ సంఘర్షణ సభ – రైతు సంఘర్షణ సభ కాదని తెలంగాణ ప్రజానీకం భావిస్తున్నారు. <br>1/2</p>— Harish Rao Thanneeru (@trsharish) <a href=”https://twitter.com/trsharish/status/1522787547847532545?ref_src=twsrc%5Etfw”>May 7, 2022</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>