Congress Party Senior Leader V.Hanumantha Rao about MLA Komatireddy Rajgopal Reddy Issue.
తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పుడిప్పుడే తెలంగాణలో మళ్లీ పుంజుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నుంచి రాజగోపాల్‌రెడ్డి బీజేపీ చేరేందుకు వ్యూహాలు రచిస్తుండటంతో కాంగ్రెస్ అధిష్టానం రాజగోపాల్‌రెడ్డిని బుజ్జగించేందుకు పార్టీ సీనియర్ నాయకులు వి.హనుమంత రావును రంగంలోకి దింపింది. అయితే కాంగ్రెస్ పార్టీలో నాకు ఘోర అవమానం జరిగిందని, ఇక పార్టీలో ఉండనని రాజగోపాల్‌రెడ్డి తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా వి.హనుమంతరావు మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి వెనక్కి వచ్చేలా లేరన్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్లకు అన్ని చోట్ల అన్యాయం జరుగుతుందని, నాక్కూడా జరిగిందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒరిజినల్ కాబట్టి ఇక్కడే నిలబడి కొట్లాడి నా అని, కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ సచ్చిపోయింది అన్నారు.. లాభం ఉన్న దక్కరికి పోతే పోయాడు..కానీ కాంగ్రెస్ నీ ఎందుకు తిట్టడం అని ఆయన మండిపడ్డారు. మునుగోడు ఎన్నికలు ఎదుర్కుంటారా లేదా.. అనేది ఆ జిల్లా నాయకులు చెప్తారని, గతంలో బీజేపీ గెలిచిన సీట్లలో మా తప్పిదం జరిగిందన్నారు. పీసీసీ ఇప్పటి నుండి అయినా సీనియర్లను కలుపుకుని పోవాలని హితవు పలికారు. అప్పుడే పార్టీ టీఆర్ఎస్..బీజేపీ లను ఎదుర్కుంటుందన్నారు.