Atrocious: వైద్యుల నిర్లక్ష్యంతో బాలిక మృతి.. ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన
- హనుమకొండ జిల్లాలోని డాల్ఫిన్ చిల్డ్రన్ హాస్పిటల్ వరుసగా చిన్నారులు మృతి..
- వైద్యుల నిర్లక్ష్యంతో వర్షిత అనే బాలిక మృతి..
- హాస్పిటల్ ఎదుట బంధువుల ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atrocious: పలు ప్రయివేటు ఆసుపత్రుల నిర్లక్ష్యం రోగుల పాలిట శాపంగా మారుతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రయివేట్ ఆసుపత్రులు మాత్రం అలసత్వం వీడనం లేదు. దీంతో పలువురు రోగులు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో రోగులు చనిపోవడం కూడా చూస్తూనే ఉన్నాం. వివిధ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలపై వైద్యశాఖ అధికారులు ఆరా తీస్తున్నా ఆసుపత్రి వర్గాల్లో మార్పు రావడంతో లేదు. అధికారుల ఉదాసీన వైఖరితో ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు వ్యవహరిస్తున్నారు.
తాజాగా హనుమకొండలో జరిగిన మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డాల్ఫిన్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో చికిత్స అందక బాలిక మృతి చెందింది. ములుగు జిల్లాకు చెందిన వర్షిత జ్వరంతో ఈనెల 2న డాల్ఫిన్ ఆస్పత్రిలో చేరింది. అయితే వైద్యం అందక బాలిక మృతిచెందింది. దీంతో కుటుంబ సభ్యులు ఆగ్రహానికి లోనయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాలిక మృతి చెందిందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. తన తప్పేమి లేదని ఆసుపత్రి వర్గాలు చేతులు దులుపుకోవడంతో ఆగ్రహించిన మృతిరాలి బంధువులు రాత్రి డాల్ఫిన్ ఆసుపత్రి కిటికీలను ధ్వంసం చేశారు. తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు, బంధువులు కోరుతున్నారు. మృతి చెందిన బాలికను ఆసుపత్రి నుంచి బయటకు తీసుకువస్తూ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు.. అక్కడున్న వారందరిని కంటతడి తెప్పించింది. డాల్ఫిన్ ఆస్పత్రిలో నెల రోజుల్లో ఇది రెండో ఘటన జరగడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆసుపత్రిపై ప్రజలు అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక సమాచారంతో పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Gandhiji Healthy Habits: గాంధీజీ అలా చేసేవారు.. కాబట్టే ఏడుపదుల వయసులో..
Also Read
తాజావార్తలు
-
Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!