మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకునేవారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఆయన అడుగుజాడల్లో నడిచేవారు మనదేశంలో అడుగడుగునా కనిపిస్తారు.

గాంధీజీ పాటించిన ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అనుసరించిన జీవనశైలిని అతి తక్కువమంది మాత్రమే ఫాలో అవుతుంటారు. 

మహాత్మాగాంధీ పూర్తి శాకాహారి..మితాహారి కూడా. ఆహారం విషయంలో ఆయన కచ్చితంగా ఉండేవారు. తన రోజూవారీ ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకొనేవారు. 

గాంధీజీ ప్రతిరోజు సుమారుగా 15 కిలోమీటర్లకు పైగా నడిచేవారు. నడకను మించిన వ్యాయామం లేదనేవారు.

సాయంత్రం వేళల్లోనూ తక్కువ స్థాయి వ్యాయామాలు చేసేవారు. ఇక ధూమపానం, మద్యపానంలాంటి అనారోగ్యకరమైన అలవాట్లకు ఆయన పూర్తి వ్యతిరేకం.

గోరువెచ్చని నీటితో గాంధీజీ దినచర్యను ప్రారంభించేవారు. ఇలా చేయడం వల్ల రక్త నాళాలు, కండరాలు, అవయవాలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.

అల్లం టీ లేదా హెర్బల్‌ టీ తాగేవారు. సీజనల్‌ పండ్లను ఎక్కువగా తీసుకునేవారు. భోజనానికి 20 నిమిషాల ముందు కూరగాయలు, పండ్లతో చేసిన సలాడ్‌ తీసుకొనేవారు.

మధ్యాహ్న భోజనంలో పప్పుతోపాటు రొట్టెలను తీసుకొనేవారు. దంపుడు బియ్యంతో చేసిన అన్నం తినేవారు. అలాగే ఆయన భోజనంలో పెరుగు ఉండేలా చూసుకొనేవారు.

సాయంత్రం పూట గ్రీన్‌ టీ లేదా అల్లం టీని తాగేవారు. డ్రై ఫ్రూట్స్‌ను స్నాక్స్‌గా తీసుకొనేవారు. గాంధీజీ రాత్రి భోజనం చాలా తక్కువగా ఉండేది. రాగి జావ, జొన్న అంబలి లాంటివి తాగేవారు.

ఇక పడుకోడానికి 30 నిమిషాల ముందు ఆయుర్వేద మూలికలు కలిపిన కప్పు గోరువెచ్చని పాలను తీసుకునేవారు

పర్యావరణ పరిశుభ్రతకూ ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు గాంధీజీ. పర్యావరణం బాగుంటేనే మనిషి ఆరోగ్యం బాగుంటుందని నమ్మేవారు. వ్యక్తిగత శుభ్రతనూ కచ్చితంగా పాటించేవారు.