Half Day Schools : చిన్నారుల రక్షణే ముఖ్యం.. పాఠశాలల తరహాలోనే అంగన్వాడీలకు హాఫ్ డే స్కూల్స్
- ఎండల తీవ్రతతో అంగన్వాడీలకు హాఫ్ డే విధానం
- ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు అమలు
- టేక్ హోం రేషన్ పంపిణీ యథావిధిగా కొనసాగింపు
- చిన్నారుల ఆరోగ్యం కోసం ప్రభుత్వ ముందస్తు నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు ముదురుతున్న నేపథ్యంలో, చిన్నారుల ఆరోగ్యం , భద్రతను దృష్టిలో ఉంచుకుని అంగన్వాడీ కేంద్రాల్లో ఒంటిపూట బడులను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల తరహాలోనే అంగన్వాడీ కేంద్రాల సమయాలను మారుస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిర్ణయంతో వేలాది మంది చిన్నారులకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభించనుంది. ప్రస్తుతానికి ఈ ఒంటిపూట బడుల విధానం ఏప్రిల్ 23వ తేదీ వరకు కొనసాగనుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల చిన్నపిల్లలు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. అంగన్వాడీ చరిత్రలోనే గత ఏడాది నుంచి ఈ ఒంటిపూట బడులు , వేసవి సెలవుల విధానాన్ని ప్రవేశపెట్టడం విశేషం.
Global Trade Crisis: ఇప్పటికే హర్మూజ్ మూసివేత.. మరో జలసంధి మూసివేతకు హౌతీల ప్లాన్..
Also Read
- KTR: శాసనసభ కాదు.. అది దుశ్శాసన సభ: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
- CM Revanth Reddy: “చర్చ తర్వాతే నిర్ణయం తీసుకుంటాం”.. సభలో సభ్యుల తీరుపై సీఎం ఆగ్రహం..!
- Nandana Arrest: యూట్యూబర్ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎయిర్‌పోర్టులో అరెస్ట్.!
- CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
ఈ ఏడాది కూడా అదే పద్ధతిని కొనసాగిస్తూ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. సమయాలు మారినప్పటికీ, లబ్ధిదారులకు అందే పౌష్టికాహార పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ‘టేక్ హోం రేషన్’ (Take Home Ration) ద్వారా గర్భిణులు, బాలింతలు , చిన్నారులకు అందాల్సిన పౌష్టికాహారాన్ని యథావిధిగా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించింది. దీనివల్ల కేంద్రాలు త్వరగా మూసివేసినప్పటికీ, లబ్ధిదారులకు అందాల్సిన పోషకాలు నేరుగా వారి ఇళ్లకే చేరుతాయి. ఒంటిపూట బడుల గడువు ముగిసిన తర్వాత, నెల రోజుల పాటు ఇచ్చే వేసవి సెలవుల గురించి ప్రభుత్వం త్వరలోనే స్పష్టత ఇవ్వనుంది. చిన్నారుల క్షేమమే పరమావధిగా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాల పట్ల అంగన్వాడీ సిబ్బంది , తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Global Trade Crisis: ఇప్పటికే హర్మూజ్ మూసివేత.. మరో జలసంధి మూసివేతకు హౌతీల ప్లాన్..
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!