బీజేపీ పై మండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందని, అధికారులను బ్లాక్ మెయిలింగ్ చేస్తుందని ఆయన ఉద్ఘాటించారు. రాష్ట్రాలకు ఉన్న అధికారాన్ని మొత్తం లాగేసుకునే కుట్ర బీజేపీ చేస్తోందని ఆయన అన్నారు. రాష్ట్ర బీజేపీ ఎంపీలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇంతటి నియంత పాలనను….ఎప్పుడూ చూడలేదని, బీజేపీ వైఖరి మారక పోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హితవు పలికారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన బుడ్డి చెబుతారని ఆయన అన్నారు. బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆయన అన్నారు. తెలంగాణను సీఎం కేసీఆర్ అభివృద్ధిలో పరుగులు పుట్టిస్తున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయన్నారు. కొన్ని రాష్ట్రాల్లో తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను తమ రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారని ఆయా వెల్లడించారు.