హైదరాబాద్ రాజ్ భవన్ లో హర్ ఘర్ తిరంగ్ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ఇందులో భాగంగా రాజ్ భవన్ లో పనిచేసే ఉద్యోగులకు జాతీయ జెండాలను, దుస్తులను పంపిణీ చేసారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. 75 వ స్వతంత్ర దినోత్సవంను పండగగా సంతోషంగా జరుపుకోవాలని కోరారు. వర్షాల కారణంగా చాలా మంది ఇంట్లోని నిత్యవసర వస్తువులు కోల్పోయారు. ఈ సందర్భంగా వారికి బట్టలు ఇతర దుస్తులు అందించడం జరిగిందని పేర్కొన్నారు. జెండా తీసుకున్న ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు గవర్నర్. రాష్ట్రంలో వ్యాక్సిన్ యొక్క బూస్టర్ రేట్ తక్కువగా ఉందని, ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ కి సంబంధించిన బూస్టర్ డోస్ వేసుకోవాలని కోరారు. లక్షణాలు ఉంటే కూడా వ్యాప్తి అంతగా ఉండదని పేర్కొన్నారు.
read also:Pre Launch Real Scam : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో కొత్త దందా | NTV
జులై 15 నుండి 75 రోజుల పాటు ఉచితం డోస్ ఇస్తున్నారని, అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించాలని సూచించారు. బ్రెస్ట్ ఫీడింగ్ పై ప్రతి తల్లీకి అవగాహన అవసరం.. డాక్టర్స్ ఈ అవగాహన కలిపించాలని కోరారు. తల్లిపాలు తాగిన చిన్నారులు ఎదుగుదల బాగుంటుందని అన్నారు. ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఒక్కరి ఇంటి పై జాతీయ జెండా ఎగురవేయాలని తెలిపారు. ఈనేపథ్యంలో.. విద్యార్థులు వివిధ కాంపిటీషన్ లు పెట్టి అందులో నుండి 75 మంది స్టూడెంట్లను ఎంపిక చేసి వారికి బహుమతులు అందిస్తామని తెలిపారు గవర్నర్.
TRS MLC Kaushik Reddy: ఈటల.. హుజురాబాద్ లో యాక్టర్, హైదరాబాద్ లో జోకర్, ఢిల్లీలో బ్రోకర్..!