నేడు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో అల్లూరి 128వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరుకానున్నారు. క్షత్రియ సేవా సమితి(తెలంగాణ, ఆంధ్రప్రదేశ్), భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుపుతున్నారు.
Congress: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలపడంతో, టీకాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నేతలు ఆయనను కలిసి ధన్యవాదాలు తెలపనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు రాజ్‌భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం కాంగ్రెస్ పార్టీ గత కొన్నేళ్లుగా పోరాడుతోంది. ఈ బిల్లు ఆమోదం పొందడంతో, బీసీ వర్గాలకు విద్య , ఉద్యోగ రంగాలలో మరింత న్యాయం చేకూరుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. Ajith :…
శ్రీ రామ నవమి పర్వదినం సందర్భంగా గోషామహల్ లోని సీతారాం బాగ్ ఆలయంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం పూజరులు గవర్నర్ కు ఘన స్వాగతం పలికి వేద ఆశీర్వాదం ఇచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ.. అది గురు శంకరచార్య దేశానికి నాలుగు వైపుల ధర్మ పరిపరక్షణకు మఠాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. "ధర్మాన్ని ఎవరు రక్షిస్తారో వారిని ధర్మం రక్షిస్తుంది.
నేడు ములుగు జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించనున్నారు. తాడ్వాయి మండలంలోని కొండపర్తి గ్రామానికి రానున్నారు. కొండపర్తి గ్రామాన్ని గవర్నర్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.
Telangana Governor: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేటి నుంచి మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఇవాళ పర్యటించనున్నారు.
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్కొక్కరికి లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నాం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మన రాష్ట్రం నుండి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఎక్కువ మంది ఎంపిక అవ్వాలన్నారు. వాళ్లకు ఆర్థిక ఇబ్బంది నీ కొంతైనా తగ్గించాలని లక్ష రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని, లక్ష…
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రేపటి నుంచి మూడు రోజులపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆగస్టు 27న యాదాద్రి ఆలయం దర్శించుకోనున్న ఆయన, అక్కడి నుంచి నేరుగా ములుగు జిల్లాకు చేరుకుంటారు..ములుగు జిల్లాలో వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన అవార్జు గ్రహీతలతో సమావేశమవుతారు. యునెస్కో గుర్తింపు పొందిన కాకతీయ కళా ఖండం రామప్ప ఆలయాన్ని వీక్షించి లక్నవరంకు వెళ్లనున్నారు. రాత్రి లక్నవరం లో బస చేసి మరుసటి రోజు హనుమకొండలో పేరొందిన కళాకారులు, ప్రముఖులతో…
నేడు ఉదయం10.30 గంటలకు రాజ్‌భవన్ దర్బార్ హాల్‌లో డాక్టర్ ఎం.ఎస్.గౌడ్ రచించిన "మైల్స్ ఆఫ్ స్మైల్స్" మై లైఫ్ జర్నీ పుస్తకాన్ని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆవిష్కరించారు.
ఉప్పల్ శిల్పారామంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే.. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ.. మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ.. నన్ను రక్షించు అని చెబుతూ సోదరుడికి రాఖీ కడుతుంది సోదరి అని, దేశాన్ని రక్షించడానికి సోదరులంతా రక్షగా ఉండాలన్నారు. పది రోజుల యుద్ధంలో రావణుడిని రాముడు చంపేశాడని, లంకలోకి లక్ష్మణుడు వెళ్లినప్పుడు మన భూమి…
తెలంగాణ సిద్ధాంత కర్త, ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా రాజ్‌భవన్‌లో కార్యక్రమాన్ని నిర్వహించారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను యావత్ ప్రపంచానికి చాటి చెప్పి ప్రత్యేక రాష్ట్ర సాధనకు జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు జయశంకర్ అని ఆయన అన్నారు