Airtel Unlimited 5g Data Palns 2024: ప్రస్తుతం భారతీయ టెలికాం సంస్థలలో ఎయిర్‌టెల్, జియో, వీఐ మధ్యనే పోటీ ఉంది. పోటీలో భాగంగా వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ మూడు కంపెనీలు నిత్యం కొత్తకొత్త ప్లాన్స్ తీసుకొస్తున్నాయి. అయితే ఎయిర్‌టెల్, జియో ఇప్పటికే దేశ వ్యాప్తంగా 5జీ సేవలను అందుబాటులోకి తేగా.. వీఐ కూడా త్వరలోనే 5జీ సేవలను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాన పోటీదారులు ఎయిర్‌టెల్, జియోలు తమ వినియోగదారులకు అపరిమిత 5జీ డేటాను అందిస్తున్నాయి. ఎయిర్‌టెల్ అందించే బెస్ట్ ప్లాన్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం.
Airtel 1499 Plan:
ఎయిర్‌టెల్ రూ.1499 ప్యాక్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ప్రతి రోజూ 3జీబీ 4జీ డేటా, అపరిమిత కాల్‌లు, 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. కంపెనీ అపరిమిత 5G డేటాను కూడా అందిస్తోంది. 15+ ఓటీటీ యాప్‌లతో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్ ట్రీమ్, ప్లే, రివార్డ్ మినీ సబ్‌స్క్రిప్షన్, అపోల్లో 24/7 సర్కిల్, ఉచిత హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటి ప్రయోజనాలు పొందవచ్చు. 84 రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్ సభ్యత్వం కూడా పొందుతారు.
Airtel 999 Plan:
ఈ ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ప్రతి రోజూ 2.5జీబీ 4జీ హై-స్పీడ్ డేటా అందిస్తుంది. అపరిమిత కాల్‌లు, అపరిమిత 5జీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు,15+ ఓటీటీ యాప్‌లతో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్ ట్రీమ్, ప్లే, రివార్డ్ మినీ సబ్‌స్క్రిప్షన్, అపోల్లో 24/7 సర్కిల్, ఉచిత హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటి ప్రయోజనాలను పొందొచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియో సభ్యత్వాన్ని 84 రోజుల పాటు ఇస్తుంది.
Also Read: U19 World Cup Final: ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి.. భారత్‌ను దెబ్బకొట్టిన ఆస్ట్రేలియా బ్యాటర్ మనోడే!
Airtel 869 Plan:
ఈ ప్యాక్ వాలిడిటీ 84 రోజులు. ప్రతి రోజూ 2జీబీ 4జీ డేటా లభిస్తుంది. అపరిమిత కాల్‌లు, అపరిమిత 5జీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, 15+ ఓటీటీ యాప్‌లతో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్ ట్రీమ్, ప్లే, రివార్డ్ మినీ సబ్‌స్క్రిప్షన్, అపోల్లో 24/7 సర్కిల్, ఉచిత హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటి ప్రయోజనాలను అందిస్తోంది. డిస్నీ+హాట్‌స్టార్ 3 నెలల సబ్‌స్క్రిప్షన్ ఉంది.
Airtel 719 Plan:
ఈ ప్లాన్ 84 రోజుల వాలిడిటీతో వస్తుంది. ప్రతి రోజూ 1.5GB 4జీ డేటా మీకు వస్తుంది. అపరిమిత కాల్‌లు, అపరిమిత 5జీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, రివార్డ్‌మినీ సబ్‌స్క్రిప్షన్, అపోలో 24/7 సర్కిల్, ఉచిత హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటి ప్రయోజనాలు ఇందులో ఉంటాయి.