IIIT Student: ఐఐటీ విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఏడాది వ్యవధిలో ముగ్గురు ఐఐటీ హైదరాబాద్ విద్యార్థుల ఆత్మహత్య చేసుకున్నారు. చదువుల్లో ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు తనువుచాలిస్తున్నారు.
మీరు మరో ‘‘నిరో చక్రవర్తి’’ గా వ్యవహరిస్తున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ రాసారు. బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల సమస్యలను తక్షణం పరిష్కారించాలని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థ బాసరలోని ట్రిపుల్ ఐటి సంస్థ అని పేర్కొన్నారు. బాసరలోని ట్రిపుల్ ఐటి విద్యార్థులు గత ఆరురోజులుగా వేల మంది విద్యార్థులు వారి న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న విషయం మీ దృష్టికి వచ్చే ఉంటుందని తెలిపారు.…
బాసర ట్రిపుల్ ఐటి క్యాంపస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వందలాది మంది బీజేపీ కార్యకర్తలు క్యాంపస్‌లోకి దూసుకు రావడంతో.. ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. క్యాంపస్ లోనికి అనుమతించకపోవడంతో.. క్యాంపస్ ఎదుట బీజేపీ నేతల ధర్నాకు దిగారు. క్యాంపస్‌లోకి ఎవరినీ రానీయకుండా మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినప్పటికీ బీజేపీ నేతలు దూసుకురావడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. మరోవైపు బాసర ట్రిపుల్ ఐటీకీ వస్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు…
బాసర ట్రిపుల్ ఐటీలో గత మూడురోజులుగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన చేస్తుండటంపై గవర్నర్ తమిళి సై సౌందర్యరాజన్ స్పందించారు. ఆమె ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. టీఎస్ సీఎంవో కు తమిళి సై ట్యాగ్ చేశారు. తల్లిదండ్రుల కలలు, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. వర్షంలోనూ తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులను చూసి తమిళిసై ఆవేదన చెందారు. తాను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు.…