Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • HYD BJP Meeting
  • Maharashtra Political Crisis
  • PM Modi AP Tour
  • Draupadi Murmu
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home News Hiv Can Be Treated Vaccine Developed By Gene Editing Could Cure Aids

HIV: హెచ్ఐవీ ఇక తలవంచాల్సిందే.. ఆ ఇంజెక్షన్‌తో ఎయిడ్స్‌కు చెక్!

Published Date - 08:55 AM, Thu - 16 June 22
By Mahesh Jakki
HIV: హెచ్ఐవీ ఇక తలవంచాల్సిందే.. ఆ ఇంజెక్షన్‌తో ఎయిడ్స్‌కు చెక్!

చికిత్స లేదు నివారణే మార్గమని భావిస్తున్న ఎయిడ్స్‌ వ్యాధిని ఇంజెక్షన్‌తో జయించే రోజులు రాబోతున్నాయి. దశాబ్దాల తరబడి మానవాళిని పీడిస్తున్న హెచ్‌ఐవీ ఇక తోకముడవనుంది. ఎయిడ్స్‌కు కారణమయ్యే ఈ వైరస్‌ను సమూలంగా అంతమొందించే సరికొత్త ఔషధాన్ని ఇజ్రాయెల్‌కు శాస్త్రవేత్తల బృందం జన్యువుల ఎడిటింగ్‌ విధానాన్ని ఉపయోగించి హెచ్‌ఐవీ–ఎయిడ్స్‌ను కట్టడి చేసే కొత్త వ్యాక్సిన్‌ను కనుగొంది. టెల్‌ అవీవ్‌ యూనివర్సిటీకి చెందిన న్యూరో బయోలజీ, బయో కెమిస్ట్రీ, బయో ఫిజిక్స్‌ శాస్త్రవేత్తల బృందం ఎన్నో పరిశోధనలు నిర్వహించి ఈ వ్యాక్సిన్‌ను రూపొందించింది. జన్యు మార్పిడి విధానంలో అభివృద్ధిచేసిన ఈ ఔషధాన్ని ఇంజెక్షన్‌ రూపంలో ఒక్కడోసు ఇవ్వడం ద్వారా… హెచ్‌ఐవీని సమర్థంగా అడ్డుకుని, ఎయిడ్స్‌ నుంచి బాధితులకు విముక్తి ప్రసాదించే అవకాశముందని వారు స్పష్టమైన నిర్ధారణకు వచ్చారు. ఎయిడ్స్‌ పరిశోధనల్లో మేలిమలుపుగా శాస్త్రవేత్తలు దీన్ని అభివర్ణిస్తున్నారు.

పరిశోధన వివరాలను నేచర్‌ జర్నల్‌ ప్రచురించింది. ఈ వ్యాక్సిన్‌ ద్వారా శరీరంలో ఉత్పన్నమయ్యే యాంటీ బాడీస్‌ అత్యంత సమర్థంగా ఉన్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. ఒక్క డోసు వ్యాక్సిన్‌తో హెచ్‌ఐవీ రోగుల్లో వైరస్‌ను తటస్థీకరించేలా చేయడంలో శాస్త్రవేత్తలు తొలి దశలో విజయం సాధించారు. ఈ ఇంజెక్షన్‌తో వైరస్‌ నిర్వీర్యం కావడంతో పాటు రోగుల ఆరోగ్యమూ బాగా మెరుగవుతోంది. ఇంజనీరింగ్‌–టైప్‌ బీ తెల్ల రక్తకణాల ద్వారా రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచి హెచ్‌ఐవీ వైరస్‌ను న్యూట్రలైజ్‌ చేసే యాంటీ బాడీలు ఉత్పత్తయేలా ఈ వ్యాక్సిన్‌ పని చేస్తుంది.

Monkeypox: మంకీపాక్స్ ప్రమాదకరమైనదేనా?

 

ఎలా పనిచేస్తుందంటే?: ఎముక మజ్జలో బి-టైప్‌గా పిలిచే తెల్ల రక్తకణాలు తయారవుతాయి. పరిపక్వం చెందిన తర్వాత ఇవి ఎముక మజ్జ నుంచి రక్తం, గ్రంథుల వ్యవస్థల్లోకి ప్రవేశిస్తాయి. తర్వాత అక్కడి నుంచి వివిధ అవయవాలకు చేరుకుంటాయి. శరీరంలో బ్యాక్టీరియా, వైరస్‌లకు వ్యతిరేకంగా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించే కణాలు కూడా ఇవే! బి-కణాలు ఎదురుపడినప్పుడు హెచ్‌ఐవీ తదితర వైరస్‌లు వాటిపై ప్రభావం చూపి, విచ్ఛిన్నమయ్యేలా ప్రోత్సహిస్తాయి. అయితే, ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు… వైరస్‌లోని కొన్ని భాగాలను ఉపయోగించి ఈ బి-కణాల జన్యువుల్లో మార్పులు చేశారు. ఇలా మార్పులు చేసిన కణాలు… వైరస్‌ ఎదురుపడినా, దాని ప్రభావానికి గురికావు. సరికదా, వైరస్‌ ప్రవర్తనను పసిగట్టి, తదనుగుణంగా తమ ప్రవర్తనను కూడా మార్చుకుంటాయి. హెచ్‌ఐవీని అడ్డుకునే యాంటీబాడీలను ఉత్పత్తి చేసేలా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తాయి. వైరస్‌ను అంతమొందించడమే లక్ష్యంగా పనిచేస్తాయి.

  • Tags
  • aids
  • curing hiv-aids
  • gene editing
  • gene editing could cure AIDS
  • HIV

RELATED ARTICLES

HIV: కండోమ్ లేకుండా శృంగారం.. దేశంలోనే ఏపీ నంబర్‌వన్

ఒమిక్రాన్ వేరియంట్‌లో హెచ్ఐవీ ల‌క్ష‌ణాలు…?

కాలేజీల్లో కూడా హెచ్‌ఐవీ టెస్ట్‌లు..! సీఎం ఆదేశాలు

త్వరలో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు శంకుస్థాపన : హారీష్ రావు

స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌కు షాకిచ్చిన ఆఫ్రికా… ఆ వ్యాక్సిన్ వాడితే…

తాజావార్తలు

  • Four-level security: ప్రధాని మోడీ హైదరాబాద్‌ టూర్.. నాలుగు అంచల భద్రత ఏర్పాటు..

  • Indian Railways: ఆగస్టు 1 నుంచి రైల్వే స్టేషన్‌లలో కొత్త నిబంధనలు

  • CPI Narayana: గడ్డం పెంచినంత మాత్రానా సన్యాసి కాదు.. నారాయణ సటైర్

  • Nupur Sharma: నీ వల్లే ఉదయ్ పూర్ ఘటన, దేశానికి క్షమాపణ చెప్పాల్సిందే.. సుప్రీం కోర్టు ఆగ్రహం

  • Manipur Landslide: 14 మంది మృతి..60 మంది చిక్కుకున్నట్లుగా అనుమానం

ట్రెండింగ్‌

  • Viral Video : ‘చిన్న బంగారం స్మగ్లర్లు’.. వీరిని ఏ సెక్షన్‌ కింద బుక్‌ చేయాలి..?

  • Interesting Facts: చిన్నారులకు తలవెంట్రుకలు ఎందుకు తీస్తారో తెలుసా?

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions