Golden Laddu: దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మండపాలు వాడ వాడలో ఆకర్షణీయమైన అలంకరణలతో అలరారుతున్నాయి. గణేశుడిని వివిధ రూపాల్లో పూజిస్తారు. ఇక కొందరు భక్తులు వినూత్నంగా, విభిన్నమైన మండపాలను ఏర్పాటు చేసి తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గణేష్ మండపాలు ఎంత ఫేమస్ అయ్యాయో, గణపతి చేతిలోని లడ్డూ కూడా అంతే ఫేమస్. లక్షల రూపాయలకు వేలం వేసి గణపతిదేవుని చేతుల మీదుగా సమర్పించే లడ్డూలను సొంతం చేసుకోవడానికి చాలా చోట్ల భక్తులు పోటీ పడుతున్నారు. అందుకోసం ప్రత్యేకంగా లడ్డూలు తయారుచేస్తారు. కొందరు వందల కిలోలతో లడ్డూలు చేస్తే…మరికొందరు డ్రై ఫ్రూట్స్, ప్రత్యేక పదార్థాలతో లడ్డూలను తయారు చేసి గణనాథుని చేతిలో పెడతారు.
Read also: Mynampally: మైనంపల్లి హనుమంత రావు నివాసంలో కాంగ్రెస్ కార్యర్తల సందడి..
హైదరాబాద్ నారాయణగూడలో గణపయ్యకు బంగారు లడ్డూను తయారు చేశారు. పసిడితో ఆకర్షణీయమైన బంగారు లడ్డూను తయారు చేసి గణపతి చేతిలో పెడతారు. వివరాల్లోకి వెళితే.. నారాయణగూడ స్ట్రీట్ నెం.5లో జై శ్రీ గణేష్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏటా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా గణనాథుడికి మండపం ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు. అయితే ఈసారి కాస్త భిన్నంగా గణపయ్య చేతిలో బంగారు లడ్డూ పెట్టారు. తులం బంగారంతో ప్రత్యేక లడ్డూ తయారు చేసి గణనాథుని చేతిలో ఉంచుతారు. మండపం నిర్వాహకులు అనీష్ గంగపుత్ర, నర్సింహగౌడ్ మాట్లాడుతూ గత 24 ఏళ్లుగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. బంగారు లడ్డూ విలువ రూ.60 వేలకు పైగా ఉంటుందని వెల్లడించారు. ఉత్సవాల చివరి రోజు గణపతి చేతిలోని 15 కిలోల లడ్డూలతో పాటు ఈ బంగారు లడ్డూలను వేలం వేయనున్నట్లు వారు వెల్లడించారు. అయితే బంగారం లడ్డూను చూసేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు.
VC. Sajjanar: గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి టీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్