Musi Rejuvenation Project : గోదావరి నీటితో నిండనున్న జంట జలాశయాలు.. హైదరాబాద్‌కు కొత్త కళ..
- మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా కీలక పనులు
- ఘన్పూర్, హిమాయత్‌సాగర్ వద్ద భారీ నీటి శుద్ధి కేంద్రాలు
- కోకాపేట్ నుంచి ఉస్మాన్‌సాగర్ వరకు పైప్‌లైన్ నిర్మాణం
- పదేళ్ల పాటు ప్రాజెక్టు నిర్వహణకు ప్రభుత్వ అనుమతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భాగ్యనగరానికి తాగునీటిని, అందాన్ని అందించిన చారిత్రక ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలు త్వరలోనే సరికొత్త శోభను సంతరించుకోనున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మూసీ పునరుజ్జీవన’ (Musi Rejuvenation) ప్రాజెక్టులో భాగంగా గోదావరి జలాలతో ఈ జంట జలాశయాలను నింపేందుకు పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. దీనికి సంబంధించి కీలకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులకు శ్రీకారం చుడుతూ ప్రభుత్వం మరో భారీ ముందడుగు వేసింది.
భారీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు.. గ్రావిటీ పైప్లైన్లు
ఈ బృహత్తర ప్రాజెక్టులో భాగంగా గోదావరి నీటిని శుద్ధి చేసి జలాశయాలకు మళ్లించేందుకు అధునాతన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను (WTP) నిర్మించనున్నారు. ఘన్‌పూర్‌లో 120 ఎంఎల్డీ (MLD), అలాగే హిమాయత్‌సాగర్ వద్ద 70 ఎంఎల్డీ సామర్థ్యంతో భారీ నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు కోకాపేట్ నుంచి ఉస్మాన్‌సాగర్ వరకు, ఉస్మాన్‌సాగర్ నుంచి హిమాయత్‌సాగర్‌ను అనుసంధానిస్తూ భారీ పైప్లైన్లను నిర్మించనున్నారు. ఇక హిమాయత్‌సాగర్ నుంచి బుద్వేల్ రిజర్వాయర్‌కు నీటిని సజావుగా తరలించేందుకు కూడా ప్రత్యేక పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను రూపొందిస్తున్నారు.
Also Read
- Omega Hospitals : దేశవ్యాప్తంగా ఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ పిడుగు... 24 చోట్ల ఏకకాలంలో విస్తృత సోదాలు..!
- Fake Aadhar: నిమిషాల్లో నకిలీ ఆధార్, పాన్ కార్డులు.. గుట్టురట్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు..
- CM Revanth Reddy: "భూకబ్జాలపై పోరాడినందుకే నన్ను జైలుకు పంపారు".. సుప్రీం తీర్పుపై రేవంత్‌రెడ్డి హర్షం
- Telangana Food Safety: తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు.. 9 సంస్థల లైసెన్సులు రద్దు..
హైబ్రిడ్ మోడల్లో ప్రాజెక్టు.. పదేళ్ల పాటు ఆమోదం
ఈ ప్రాజెక్టును అత్యంత పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేసేందుకు ‘హైబ్రిడ్ యాన్యుటీ మోడల్’ (HAM) విధానంలో పనులను అమలు చేస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టు పనుల నియామక తేదీగా (Appointed Date) 2026 జూన్ 24ను నిర్ణయించిన ప్రభుత్వం, ప్రాజెక్టు నిర్వహణ , మౌలిక వసతులకు పదేళ్ల పాటు అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే గోదావరి జలాలతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లు నిరంతరం జలకళతో విలసిల్లడమే కాకుండా, మూసీ నదికి మళ్లీ పూర్వవైభవం రావడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Musi Rejuvenation Project : గోదావరి నీటితో నిండనున్న జంట జలాశయాలు.. హైదరాబాద్‌కు కొత్త కళ..
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Innodata Layoffs: ఇన్నోడేటా ఉద్యోగులకు షాక్.. రాత్రికి రాత్రే 90 శాతం మందికి లేఆఫ్.?
-
Sai Pallavi: త్వరలో సాయి పల్లవి పెళ్లి? వరుడు ఎవరో తెలుసా..
-
SEC Meeting: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు ఆల్ సెట్.. ఎస్ఈసీ కీలక రివ్యూ
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!