భారీగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు వరద కొనసాగుతోంది. వరద తాకిడికి ఫుల్ ట్యాంక్ లెవెల్ కి చేరాయి. ఉస్మాన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్1790 అడుగులు కాగా.. 1789.25 అడుగులకు చేరిన నీటిమట్టం.. హిమాయత్ సార్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1763.50 కాగా.. ప్రస్తుతం 1762.80 అడుగులకు చేరిన నీటిమట్టం..6 గేట్లు 5 అడుగుల మేర తెరిచి 3072 క్యూసెక్కుల నీటిని ఉస్మాన్ సాగర్…
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు జంట జలాశయాలను మరోసారి నింపేశాయి. ముఖ్యంగా వికారాబాద్, తాండూర్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల కారణంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లకు వరద పోటెత్తింది.
నిన్నటి నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు జంట జలాశయాలను నిండుకుండలా మార్చాయి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా చేరుతోంది.
జంట జలాశయాలకు కొనసాగుతున్న వరద నీరు కొనసాగుతుంది. హిమాయత్‌సాగర్‌లోకి ప్రస్తుతం 800 క్యూసెక్కుల వచ్చి చేరుతుంది. హిమాయత్‌సాగర్ గరిష్ఠ నీటిమట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1762.10 అడుగులకు నీరు చేరింది. దాంతో హిమాయత్ సాగర్ రెండు గేట్ల ద్వారా మూసీ లోకి 700 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఇక ఉస్మాన్ సాగర్ లోకి 1200 క్యూసెక్కుల నీరు వస్తుంది. ఉస్మాన్‌సాగర్ జలాశయం గరిష్ఠ నీటిమట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1789.50 అడుగులుగా…