భారీగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు వరద కొనసాగుతోంది. వరద తాకిడికి ఫుల్ ట్యాంక్ లెవెల్ కి చేరాయి. ఉస్మాన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్1790 అడుగులు కాగా.. 1789.25 అడుగులకు చేరిన నీటిమట్టం.. హిమాయత్ సార్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1763.50 కాగా.. ప్రస్తుతం 1762.80 అడుగులకు చేరిన నీటిమట్టం..6 గేట్లు 5 అడుగుల మేర తెరిచి 3072 క్యూసెక్కుల నీటిని ఉస్మాన్ సాగర్…
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు జంట జలాశయాలను మరోసారి నింపేశాయి. ముఖ్యంగా వికారాబాద్, తాండూర్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల కారణంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లకు వరద పోటెత్తింది.
నిన్నటి నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు జంట జలాశయాలను నిండుకుండలా మార్చాయి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా చేరుతోంది.
Gate Way Of Hyderabad : హైదరాబాద్ కోర్ అర్బన్ సిటీ ఏరియాలో చేపట్టే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ ను బహుళ ప్రయోజనాలుండేలా అత్యంత అధునాతనంగా నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు స్వాగతం పలికేలా హైదరాబాద్ ముఖద్వారంగా హిమాయత్ సాగర్ గాంధీ సరోవర్ దగ్గర ఓఆర్ఆర్ పై గేట్ వే అఫ్ హైదరాబాద్ నిర్మించాలని సూచించారు. ఓఆర్ఆర్ కు ఒక వైపున ఎకో థీమ్ పార్క్ అభివృద్ధి…
Heavy Flood Water: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. కుండపోత వర్షాల ధాటికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక, రంగారెడ్డి జిల్లాలో జంట జలాశయాలు నిండు కుండలుగా కనిపిస్తున్నాయి. గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాలకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది.
హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లు నిండుకున్నాయి. వికారాబాద్, తాండూర్, శంకర్ పల్లి, షాద్ నగర్, షాబాద్ నుంచి జలాశయాల్లోకి భారీగా వరద నీరు చేరుతుంది. ఈ క్రమంలో అధికారులు అలర్ట్ అయ్యారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయానికి చెందిన రెండు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు.
మునుగోడు ఉప ఎన్నికలో TDP పోటీ చేయడంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, త్వరలో వెల్లడిస్తామని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ తరఫున అందరూ కలిసికట్టుగా పనిచేయాలని నేతలకు చంద్రబాబు సూచించారు.