Stray Dogs: ఇదే పని ముందే చేసి ఉంటే.. అంబర్ పేట చిన్నారి ప్రాణాలు దక్కేవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stray dogs: సంతోష్ నగర్ కాలనీలో ఐదేళ్ల బాలుడిపై వీది కుక్క దాడి ఘటనతో జీహెచ్‌ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. పాతబస్తీలో కుక్కలను పట్టుకునే ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. ఉదయం నుంచి సంతోష్ నగర్ పరిసరాల్లో స్పెషల్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.. వీధి కుక్కల పరుగెడుతుంటే వాటి వెంటపడి పట్టుకుంటున్నారు. కుక్కల కోసం అన్నీ వీధులు, కాలనీల్లో తిరుగుతున్నారు. వారిని చూసి వీధి కుక్కలు పారిపోతున్నాయి
అటు మనుషులపై కుక్కల దాడులు కొనసాగుతున్నాయి. నిన్న సంతోష్ నగర్.వారం క్రితం కాంచన్ బాగ్. అంతకు ముందు అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి మృతితో పాటు పలు ఘటనలు చోటు చేసుకున్నాయి.సంతోష్ నగర్ లో ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల పిల్లాడు అబ్దుల్ రఫె వీధి కుక్క దాడి చేసింది. పిల్లాడు కేకలు వెయ్యడంతో.. ఆ అరుపులు విన్న స్థానికులు.. పిల్లాణ్ని కాపాడారు. అప్పటికే ఆ కుక్కలు.. పిల్లాడి కాళ్ళు. వీపు, చేతిని విచక్షణా రహితంగా దాడి చేశాయి. దీంతో కుటుంభ సభ్యులు పరుగున ఆసుపత్రికి తరలించారు. వీధికుక్కల దాడిలో రోజుకో చిన్నారులు గురవుతునే వున్నారు. చిన్న పిల్లల్ని వీధిలో వదలాలంటేనే తల్లిదండ్రులు భయంతో బిక్కు బిక్కు మంటున్నారు.
Also Read
- KBR Park Elevated Corridor: 14 ఫ్లై ఓవర్స్ వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
- MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
- Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
- Bhatti Vikramarka: ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.!
చిన్నారులపైనే కాకుండా పెద్దలపై కూడా వీధి కుక్కలు దాడి చేస్తున్నాయి. అటు చిన్నారు, ఇటు పెద్దవారు అనే తేడాలేండా శరీరాలను పీక్కుతుంటున్నాయి. కొందరు బతికి ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేసుకుంటుంటే మరి కొందరు కుక్కల దాడికి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఘటనలో ఎక్కువ చిన్నారులే కావడం గమనార్హం. మొత్తంగా నగరంలో ఈ వీధి కుక్కల సమస్య తలనొప్పిగా మారింది. ఇక దీంతో జీహెచ్ ఎంసీ అలర్ట్ అయ్యింది. ఇప్పుడు అధికారులు కుక్కల కోసం పరుగులు పెడుతున్నారు. గల్లీ గల్లీ లో వెళ్లి వీధికుక్కలను బంధిస్తూ తరలిస్తున్నారు. ఎక్కడ వీధి కుక్కలు కనపడినా పరుగులు పెడుతూ వాటిని బంధిస్తున్నారు. అయితే జీహెచ్ ఎంసీ చేస్తున్న పనికి అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే పని ఇంతకుముందే చేసి ఉంటే.. అంబర్ పేటలో చిన్నారి ప్రాణాలు దక్కేవే అంటున్నారు. అంతా అయిపోయాక.. ఇప్పుడు ఏం చేసి ఏం లాభం అని కొందరు విమర్శిస్తుంటే.. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచారని మరికొందరు అంటున్నారు. ఎట్టకేలకు జీహెచ్ ఎంసీ ఇప్పటికైనా స్పందించిందని అంటున్నారు. ఇదేమని ముందే చేసి ఉంటే ఇప్పటి వరకు కుక్కల దాడికి బలైన వారి సంఖ్య ఉండేది కాదని చెబుతున్నారు.
Minister Harish rao: సిద్దిపేటలో రైలు కూత వినిపించాలని.. అధికారులకు మంత్రి ఆదేశం
తాజావార్తలు
-
KBR Park Elevated Corridor: 14 ఫ్లై ఓవర్స్ వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!