Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assembly Protest: తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి దివ్యాంగులు ప్రయత్నించారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ నుంచి అసెంబ్లీ వైపు ర్యాలీగా బయలుదేరిన దివ్యాంగులను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ శాసనసభాపక్ష ఉపనేత పాయల్ శంకర్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తదితరుల ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టారు. గన్‌పార్క్ చేరకముందే పోలీసులు వారిని నిలువరించారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ముఖ్యంగా పెన్షన్, రుణాలు, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, ఉచిత రవాణా వంటి అంశాలపై ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. కాంగ్రెస్ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో దివ్యాంగులకు నెలకు రూ.6,000 పెన్షన్ హామీని ప్రకటించింది. ఎలాంటి గ్యారంటీ లేకుండా దివ్యాంగులకు రూ.5 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. ఇల్లు లేని దివ్యాంగులకు ఇళ్ల నిర్మాణం, బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి వారి సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అన్నారు.
Also Read
- Jamia Students Protest: "2006 నుంచి ఎన్నికలు లేవు".. తీవ్రరూపం దాల్చిన జామియా యూనివర్సిటీ విద్యార్థుల ఉద్యమం..
- AP Local Elections 2026: రెబల్స్ పోటీలో ఉంటే సస్పెండే.. సీఎం చంద్రబాబు హెచ్చరిక!
- Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
- Konda Surekha: "అప్పట్లో రాజకీయ పరిస్థితుల వల్లే అలా అన్నాను".. కేటీఆర్‌పై ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న కొండా సురేఖ
ప్రభుత్వంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ దివ్యాంగులకు పలు హామీలు ఇచ్చిందని పాయల్ శంకర్ ఆరోపించారు. అయితే వాటిలో అనేకం అమలు కాలేదని విమర్శించారు. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా దివ్యాంగులతో కలిసి అసెంబ్లీ వైపు ర్యాలీగా వస్తున్న పాయల్ శంకర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దివ్యాంగులను అసెంబ్లీ వైపు అనుమతించకుండా నిలువరించగా.. ఎమ్మెల్యేలను మాత్రం లోపలికి అనుమతించినట్లు బీజేపీ నేతలు తెలిపారు. పోలీసులు భారీగా మోహరించి ఆందోళనకారులను అడ్డుకున్నారు.
దివ్యాంగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని పాయల్ శంకర్ ఆరోపించారు. కేవలం సంక్షేమ పథకాలు అమలు చేయడం సరిపోదని.. దివ్యాంగులకు ఉపాధి, ఆర్థిక స్వావలంబన, రవాణా, విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల కేటగిరీలో లక్షలాది మంది ఆసరా లబ్ధిదారులు నమోదై ఉన్నారు. దివ్యాంగుల సమస్యలపై రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్న నేపథ్యంలో.. తమకు సంబంధించిన మిగిలిన హామీలు, డిమాండ్లను కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆందోళనకారులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Jamia Students Protest: “2006 నుంచి ఎన్నికలు లేవు”.. తీవ్రరూపం దాల్చిన జామియా యూనివర్సిటీ విద్యార్థుల ఉద్యమం..
-
AP Local Elections 2026: రెబల్స్ పోటీలో ఉంటే సస్పెండే.. సీఎం చంద్రబాబు హెచ్చరిక!
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Honor X8e 4G: హానర్ X8e 4G లాంచ్.. 108MP కెమెరా, 7,700mAh బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్!
-
Konda Surekha: “అప్పట్లో రాజకీయ పరిస్థితుల వల్లే అలా అన్నాను”.. కేటీఆర్‌పై ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న కొండా సురేఖ
ట్రెండింగ్
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..
-
WPL 2027 మినీ వేలం పూర్తి.. 25 మంది ఆటగాళ్ల కొనుగోలు.. 5 జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవే..!
-
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!
-
WPL Auction 2027: వైభవ్ సూర్యవంశీ మాదిరే.. డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కురాలు.. ఎవరీ ఉమా కాశ్వి!