Montha Cyclone: మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. అనేక జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం.. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హన్మకొండ, హైదరాబాద్, జనగాం, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూలు, నల్గొండ, నారాయణపేట్, రంగారెడ్డి, సిద్దిపేట్, సూర్యాపేట్, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి-భువనగిరి…
Rain Alert: రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తా జిల్లాలలో భారీగా వర్షం కురుస్తుండగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రాష్ట్రం మొత్తం వరుణిడికి దెబ్బకి అతలాకుతలమయ్యింది. ఇక తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం సంగతి గురించి చెప్పనక్కర్లేదు. కొద్దిపాటి వర్షం పడితేనే జలమయమయ్యే రోడ్లతో ఇబ్బంది పడే నగరవాసులు ఇప్పుడు కుండపోత వర్షం కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. illicit Affairs: తిరుపతిలో దారుణం.. కూతురు ముందే అల్లుడితో పెళ్ళికి…
Hyderabad: హైదరాబాదులో భారీగా వర్షపాతం నమోదైంది. ఖాజాగూడలో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎస్సార్ నగర్ లో 11 సెంటీమీటర్లు, సరూర్నగర్ లో 10, ఖైరతాబాద్ లో 11 సెంటీమీటర్లు వర్షం కురిసింది. నిమ్స్ ఆస్పత్రి వద్ద వరద నీరు భారీగా నిలిచిపోయింది. పంజాగుట్ట, ఖైరతాబాద్ వద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
గ్రేటర్ హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌కు అతి భారీ వర్ష సూచన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించడంతో జీహెచ్‌ఎంసీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.
సంతోష్ నగర్ కాలనీలో ఐదేళ్ల బాలుడిపై వీది కుక్క దాడి ఘటనతో జీహెచ్‌ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. పాతబస్తీలో కుక్కలను పట్టుకునే ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. ఉదయం నుంచి సంతోష్ నగర్ పరిసరాల్లో స్పెషల్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.