ఆయన ఎప్పుడు ఏ గట్టున ఉంటారో తెలియదు. ఇప్పటివరకు ఏ పార్టీలోనూ కుదురుగా లేరు. ఇప్పుడు కొత్త గూటికి చేరారు. అక్కడ ఎన్నిరోజులు ఉంటారో.. ఏమో? ఎందుకు పదే పదే కండువా మార్చేస్తున్నారు?ఆయనే గట్టు రామచంద్రరావు. ఖమ్మం జిల్లాకు చెందిన ఆయన.. గతంలో కమ్యూనిస్ట్. లెఫ్ట్ పార్టీల హవా నడిచిన సమయంలో సీపీఎం నాయకుడిగా గళం వినిపించేవారు. 2008లో CPM నాయకత్వంపై తిరుగుబాటు ప్రకటించి సంచలనం రేపారు. అక్కడ నుంచి ఆయన పరిస్థితి ఎక్కే గుమ్మం దిగే…
ఈ మధ్యే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన గట్టు రామచంద్రరావు… ఇవాళ వైఎస్ షర్మిల సమక్షంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేరారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో జాతీయ పార్టీలు ప్రత్యామ్నాయం కావని.. టీఆర్ఎస్‌కి వైఎస్సార్ తెలంగాణ పార్టీనే ప్రత్యామ్నాయంగా చెప్పుకొచ్చారు.. వైఎస్ షర్మిల చేస్తున్న పోరాటం.. బీజేపీ, కాంగ్రెస్‌లు చేయడం లేదన్న ఆయన.. తెలంగాణలో వైఎస్సార్ లెగసీ ఎక్కడకు పోలేదన్నారు.. వైఎస్సార్ కి జిరాక్స్ కాపిలా వైఎస్ షర్మిల కనిపిస్తున్నారు.. మహిళలకు ప్రాధాన్యత షర్మిల…
తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు ఆ పార్టీ నేత గట్టు రామచంద్రరావు… టీఆర్ఎస్ పార్టీలో చురుకుగా పనిచేసిన ఆయన.. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడంలేదు.. అయితే, పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు లేఖరాసిన గట్టు రామచంద్రరావు… “నేను మీ అభిమానాన్ని పొందడంలో.. గుర్తింపు తెచ్చుకోవడంలో విఫలమయ్యాను.. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కరెక్టు కాదని భావించాను.. అందుకే పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు..…