Atrocious: తార్నాకలో మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన నగరం ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది. అర్ధరాత్రి సమయంలో మహిళను లాలాపేటలో వదిలిపెడతానంటూ ఆమెను బైక్ ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లాడు. అనంతరం తన నలుగురు ఫ్రెండ్స్ ను ఆ ప్రదేశానికి రప్పించుకుని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై పోలీసులకు బాధితురాలు సమాచారం ఇవ్వడంతో ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులను పోలీసులు అదుపులో తీసుకుని రిమాండ్ కు తరలించినట్లు సమాచారం.
Read also: Chandrababu: నేడు ఏపీ హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ
హైదరాబాద్ ప్రశాంత్‌నగర్ లో నివాసం ఉంటున్న ఏసు మెకానిక్ గా పనిచేస్తున్నాడు. డిసెంబర్ 7వ తేదీన అర్ధరాత్రి ఏసు ప్రశాంత్ నగర్ వెళుతుండగా.. బస్ కోసం వెయిట్ చేస్తున్న ఓ మహిళను లాలాపేటలో డ్రాప్ చేస్తానని నమ్మించి బైక్ ఎక్కించుకున్నాడు. మాటలు కలుపుతూ ఆమెను ప్రశాంత్ నగర్ రైల్వేక్వార్టర్స్ వద్ద నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బెదిరించాడు. తన నలుగురు మిత్రులైన మధు యాదవ్, ప్రశాంత్, తరుణ్, రోహిత్ ను పిలిపించుకున్నాడు. అనంతరం నలుగురి మిత్రులతో కలిసి అత్యాచారం చేశాడు. అక్కడి నుంచి ఏమీ తెలియనట్లు ఆమెను లాలాపేటలో డ్రాప్ చేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. దీంతో ఆ మహిళ భయంతో వణికిపోయింది. చివరకు కుటుంబ సభ్యులు ఆ మహిళ సైలెంట్ ఉండటాన్ని గమనించి ఏం జరిగిందని ప్రశ్నించగా అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ తల్లిదండ్రులు లాలగూడా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అప్పటినుంచి పోలీసులు సరవేగంగా కేసుపై దర్యాప్త ప్రారంభించారు. ఎట్టకేళకు 10రోజుల తరువాత మహిళపై అత్యాచారం జరిపిన ప్రశాంత్.. మధుసూదన్.. రోహిత్, తరుణ్ అను చాకచక్యంగా అదుపులో తీసుకున్నారు. అనంతరం వారందరిని రిమాండ్ కు తరలించారు.
Mrunal Thakur: వామ్మో.. ఒక్క యాడ్ కు మృణాల్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ అన్ని లక్షలా?