Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- ఉచిత పథకాల కోసం ప్రజాధనం ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్న
- ప్రభుత్వ రంగ సంస్థలను లాభాల్లోకి తీసుకురావాలని సూచన
- భూసేకరణ బాధితుల సమస్యలపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశం
- పథకాలపై స్టే ఎత్తివేయాలని ప్రభుత్వ న్యాయవాదుల విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. చట్టబద్ధత లేని పథకాల కోసం ప్రజాధనాన్ని ఎలా వృథా చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వ రంగ సంస్థలను ముందుగా లాభాల బాట పట్టించి, ఆ తర్వాత వచ్చే ఆదాయంతో ఇటువంటి ఉచిత పథకాలకు నిధులు ఖర్చు చేయవచ్చు కదా అని ధర్మాసనం అభిప్రాయపడింది. మరోవైపు భూసేకరణ బాధితులకు సరైన న్యాయం జరగక వారు నిత్యం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, ఈ విషయంలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో రేపటి విచారణలోగా స్పష్టం చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
Also Read
- TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాల పరీక్షల తేదీలు ఖరారు..
- Telangana DEO : తెలంగాణలో 4 జిల్లాలకు కొత్త డీఈఓలు.. ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగింత
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
- Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
భూ బాధితుల సమస్యలపై పూర్తి వివరాలను రేపు కోర్టు ముందు ఉంచాలని ఆదేశిస్తూనే, కేసు తదుపరి విచారణను మరుసటి రోజుకు వాయిదా వేసింది. కాగా, నిరుపేద మహిళల సంక్షేమం కోసం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై ఉన్న స్టేను తక్షణమే ఎత్తివేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ పథకాల లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరిన నేపథ్యంలో, రేపటి విచారణలో హైకోర్టు తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
తాజావార్తలు
-
TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాల పరీక్షల తేదీలు ఖరారు..
-
Telangana DEO : తెలంగాణలో 4 జిల్లాలకు కొత్త డీఈఓలు.. ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగింత
-
Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
-
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!