Delhi CNG Blast: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. సీఎన్జీ సిలిండర్ పేలి ముగ్గురు మృతి
- ఢిల్లీలో ఘోర ప్రమాదం
- సీఎన్జీ సిలిండర్ పేలి ముగ్గురు మృతి
- పలువురికి గాయాలు.. ఆస్పత్రిలో చికిత్స
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టిక్రీ కలాన్ ప్రాంతంలోని ఓ ఫ్యూయల్ పంప్లో ట్రక్కు సీఎన్జీ సిలిండర్ పేలిపోయింది. వాహనంలో సీఎన్జీ నింపుతున్న సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు సమాచారం.
సీఎన్జీ నింపుతుండగా పేలుడు
బుధవారం ఢిల్లీలోని టిక్రీ కలాన్‌లో ఈ ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం 3:37 గంటలకు పేలుడు ఘటనపై తమకు సమాచారం అందినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..

పోలీసుల వివరాల ప్రకారం.. ట్రక్కు సీఎన్జీ సిలిండర్‌లో గ్యాస్ నింపుతున్న వ్యక్తి పేలుడు ధాటికి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో పలువురు గాయపడటంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో మరో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పేలుడుకు గల కచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం నేపథ్యంలో ఫ్యూయల్ పంప్ దగ్గర భద్రతా చర్యలను చేపట్టారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!