PM Modi: యువతపై ప్రత్యేక దృష్టి.. రోజుకో యూనివర్సిటీ సందర్శనకు కేంద్ర మంత్రి!
- యువతపై ప్రత్యేక దృష్టి
- రోజుకో యూనివర్సిటీ సందర్శనకు కేంద్ర మంత్రి!
- కేబినెట్ సమావేశంలో ప్రధాని మోడీ చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జెన్-జీ యువతతో మరింత మమేకమయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రోజుకో యూనివర్సిటీని సందర్శించి.. విద్యార్థుల సమస్యలు తెలుసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై మంత్రివర్గ సమావేశంలో మోడీ ప్రత్యేకంగా చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read
- Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
- Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
- LPU Students Protest: LPUలో స్టూడెంట్స్ రచ్చ.. రేప్ ఆరోపణలతో వర్సిటీలో విధ్వంసం..
- Congress: మోడీ గెలిచిన వారణాసిలో రీపోలింగ్ నిర్వహించాలి.. యూపీ కాంగ్రెస్ చీఫ్ డిమాండ్..
దేశంలోని ఒక్కో యూనివర్సిటీకి రోజుకో కేంద్ర మంత్రిని పంపించి.. విద్యార్థులతో నేరుగా సమావేశమై వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా యువత ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకోవడంతో పాటు.. వారికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.
‘వన్ డే.. వన్ యూనివర్సిటీ’
‘వన్ డే.. వన్ యూనివర్సిటీ’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజూ ఒక కేంద్ర మంత్రి కేటాయించిన యూనివర్సిటీని సందర్శిస్తారు. విద్యార్థులతో నేరుగా సమావేశమై వివిధ అంశాలపై వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. వారి సమస్యలు, ఆలోచనలు, దేశంలో జరుగుతున్న పరిణామాలపై యువత అభిప్రాయాలను స్వయంగా వింటారు. అదే సమయంలో యువత, విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి వారికి వివరిస్తారు.
ఇద్దరికి బాధ్యతలు
ఈ కార్యక్రమం కోసం యూనివర్సిటీలతో, ఆయా పర్యటనలకు వెళ్లే కేంద్ర మంత్రులతో సమన్వయం చేసే బాధ్యతలను విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు అప్పగించినట్లు తెలుస్తోంది. బుధవారం మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
దేశంలో 1,300 యూనివర్సిటీలు
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా సుమారు 1,300 యూనివర్సిటీలు ఉన్నాయి. వీటిలో 57 కేంద్ర విశ్వవిద్యాలయాలు, 522 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. మిగిలినవి డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలుగా ఉన్నాయి. దీంతో ‘వన్ డే.. వన్ యూనివర్సిటీ’ కార్యక్రమం ద్వారా భారీ సంఖ్యలో విద్యార్థులను నేరుగా కలిసే అవకాశం కేంద్ర మంత్రులకు లభించనుంది.
విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో..
దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నీట్ పేపర్ లీక్ అంశంపై విద్యార్థులు నిరసనలు చేపట్టడంతో పాటు.. దేశంలోని పలు ప్రాంతాల్లోనూ స్థానికంగా విద్యార్థుల ఆందోళనలు జరిగాయి. ఢిల్లీలో నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు చర్యలు తీసుకోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ అంశంపై ప్రతిపక్షాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆందోళనకు దిగాయి.
యువతపై ప్రత్యేక దృష్టి
విద్యార్థుల ఆందోళనల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ కూడా పలుమార్లు సోషల్ మీడియా వేదికగా యువతతో మాట్లాడారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలోనూ యువతకు సంబంధించిన పలు కీలక కార్యక్రమాలను ప్రకటించారు. ఉచిత ఆన్లైన్ కోచింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్కిల్లింగ్ ప్రోగ్రామ్, క్రీడా ప్రతిభను గుర్తించే కార్యక్రమం, సివిల్ డిఫెన్స్ నెట్‌వర్క్‌ను విస్తరించడం వంటి పలు అంశాలను ప్రస్తావించారు. తయారీ, అంతరిక్షం, అణుశక్తి, సెమీకండక్టర్ల వంటి రంగాల్లో యువతకు అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
-
Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
-
Cyber Fraud: లేడీ మాయలో డాక్టర్.. ఫేస్బుక్ పరిచయంతో రూ.14.61 కోట్లు స్వాహా..!
-
OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
-
TG SAFE : ఆదేశాలు బేఖాతరు.. యథేచ్ఛగా రెస్టారెంట్లు ఓపెన్..!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?