CI Viral Video : విద్యార్థుల గొంతు నులిమిన సీఐ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.!
- మహబూబాబాద్ కలెక్టరేట్ వద్ద పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన
- ఇద్దరు విద్యార్థుల గొంతు నొక్కిన సీఐ రఘుపతి రెడ్డి
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఘటనకు సంబంధించిన వీడియో
- సీఐపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CI Viral Video : మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టిన పాలిటెక్నిక్ విద్యార్థుల పట్ల పోలీస్ అధికారి అత్యంత దురుసుగా ప్రవర్తించడం కలకలం రేపింది. ఆందోళన చేస్తున్న సమయంలో సీఐ రఘుపతి రెడ్డి ఇద్దరు విద్యార్థుల గొంతును గట్టిగా నొక్కి పట్టి కాసేపటి వరకు వదలకుండా చేయడంతో ఆ విద్యార్థులు ఊపిరాడక తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సోషల్ మీడియాలో వీడియో వైరల్.. మండిపడుతున్న స్థానికులు
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై సీఐ రఘుపతి రెడ్డి చెయ్యి చేసుకుని గొంతు నొక్కి పట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పరిస్థితిని సమన్వయంతో అదుపులోకి తీసుకురావాల్సిన బాధ్యతాయుతమైన పోలీస్ ಅಧಿಕారి, విద్యార్థుల పట్ల ఇలా ప్రవర్తించడం పట్ల స్థానికులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ హక్కుల కోసం, న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన బాట పట్టిన విద్యార్థుల పట్ల పోలీసుల ఈ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
Also Read
- IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
సీఐపై చర్యలకు విద్యార్థి సంఘాల డిమాండ్
విద్యార్థులపై అమానుషంగా ప్రవర్తించిన సీఐ రఘుపతి రెడ్డిపై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థుల ప్రాణాలకు ముప్పు కలిగించేలా ప్రవర్తించిన సదరు అధికారిని విధుల్లోంచి తొలగించాలని, బాధితులకు న్యాయం చేయాలని వారు స్పష్టం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Chandu Mondeti : టాలీవుడ్, బాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ లాక్..?
-
UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
-
Rain Alert: ఉరుములు, మెరుపులతో మూడు రోజులు వర్షాలు!
-
IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
-
Nethanna Bharosa: చేనేతలకు సర్కార్ మరో గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!