four-were-killed-in-accident-in-nizamabad: నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం కొత్తపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టైర్ పేలడంతో.. కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో కారు టైర్ పేలడంతో కారు గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టింది. డివైడర్ ను దాటి అవతిలి రోడ్డుపై కారు పడిపోయింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు వున్నారు. మరోముగ్గరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో ఏడుగురు ప్రయాణికులు వున్నట్లు పోలీసులు తెలిపారు.
read also: Nara Lokesh: లోకేష్ కీలక సూచనలు.. అధ్యయనానికి టీడీపీ కమిటీ..
హైదరాబాద్ నుంచి నిర్మల్ వెళ్తుండగా ఈఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. అతివేగమే దీనికి కరణమా? లేక కారు టైరు పేలడంతోనే డివైడర్‌కు ఢీకొని ఈ ప్రమాదం జరిగిందా?.. వీరు కారులో హైదరాబాద్ నుంచి నిర్మల్ కు ఎందుకు వెలుతున్నారు, ఏదైనా ఫంక్షన్ కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారణ చేపట్టారు.
Heavy rains in AP and Telangana: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు.. నిండుకుండలా ప్రాజెక్టులు