Heavy rains in AP and Telangana Full of projects: తెలుగు రాష్ట్రాల్లో ఏకధాటిగా కురిస్తున్న భారీ వర్షాలతోపాటు, ఎగువ నుంచి ప్రవాహం తోడై ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. దాదాపుగా అన్ని జలాశయాలు గరిష్ఠ నీటిమట్టానికి చేరుకోవడంతో నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు.
భద్రాచలం
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. సోమవారం 35 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం… ఇవాళ 41. 2 అడుగులు దాటింది.
కాళేశ్వరం
భూపాలపల్లి కాళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం స్వల్పంగా పెరుగుతుంది. 11.65 మీటర్ల ఎత్తులో ఉభయ నదులు పుష్కర ఘాట్ల మెట్లపై నుండి ప్రవహిస్తుంది.
రామన్నగూడెం
ములుగు జిల్లా రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద ప్రస్తుత నీటి మట్టం.15. 300 మీటర్లకు చేరుకుంది. గోదావరి నెమ్మదిగా పెరిగుతుంది. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది.
గడ్డెన్న వాగు
నిర్మల్ జిల్లా బైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న ఇన్ ఫ్లో, ఇన్ ఫ్లో: 1000 క్యూ సెక్కులు కాగా, అవుట్ ఫ్లో: 1000 క్యూ సెక్కులుగా వుంది. దీంతో అధికారులు 1 గేట్ ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం : 358.70 మీటర్లకు చేరింది. ప్రస్తుత నీటి మట్టం : 357.70 మీటర్లు చేరువలో వుంది.
జూరాల
మహబూబ్ నగర్ జిల్లా జూరాలకు వరద పోటెత్తింది. 37 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేసారు అధికారులు. ఇన్ ఫ్లో : 1,02,498 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 1,03,169 క్యూసెక్కులు, పూర్తిస్థాయి నీటిమట్టం :1045 ఫీట్లు, ప్రస్తుత నీటిమట్టం :1,042.487 ఫీట్లు కొనసాగుతోంది. పూర్తి నీటి సామర్థ్యం: 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ: 8.126 టీఎంసీలు గా వుంది. 12 యూనిట్లతో విద్యుత్ ఉత్పత్తి, ఎత్తి పోతల పథకాలకు నీటి విడుదల చేసారు అధికారులు.
కడెం
నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు కు ఇన్ ఫ్లో తగ్గుముఖం పట్టింది. ప్రస్తుత ఇన్ ఫ్లో 3967 c/s కాగా, ఒక్క గేటు ద్వారా దిగువకు 2717 c/s నీటిని వదిలారు అధికారులు. నీటి మట్టం: 686.300/700 ఫీట్ కాగా, నీటి సామర్ధ్యం: 4.542/7.603 టీఎంసీలుగా కొనసాగుతుంది.
read also: Uttar Pradesh: స్వాతంత్య్ర దినోత్సవం వేళ విధ్వంసానికి ఐసిస్ ప్లాన్
ఏపీలో ప్రాజెక్టులు
పోలవరం
పోలవరం దగ్గర పెరుగుతోన్న గోదావరి నీటిమట్టం, పోలవరం ఎగువ కాఫర్ డ్యాం దగ్గర 32.690 మీటర్ల నీటిమట్టం, పోలవరం దిగువ కాఫర్ డ్యాం దగ్గర 23.800 మీటర్ల నీటిమట్టం కొనసాగుతుంది.
పులిచింతల
పల్నాడు జిల్లా పులిచింతల ప్రాజెక్టు మూడు గేట్ల ద్వారా నీటి విడుదల చేసారు. ఇన్ ఫ్లో 34వేల 726 క్యూసెక్కులు. అవుట్ ఫ్లో… 51వేల 640 క్యూసెక్కులు కాగా కొనసాగుతుంది. పులిచింతల పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం… 45.77 టీఎంసీలు, ప్రస్తుత నీటినిల్వ… 39.36 టీఎంసీలు.
శ్రీశైలం
నంద్యాల లోని శ్రీశైలం జలాశయానికి వరద ఉదృతి భారీగా పెరుగుతుంది. జలాశయం 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ ఫ్లో : 2,69,716 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 2,85,368 క్యూసెక్కులు, పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం : 884.50 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు, ప్రస్తుతం : 212.9198 టీఎంసీలు, కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.
One Charger For All Gadgets: తీరనున్న కష్టాలు..! అన్ని రకాల గాడ్జెట్స్‌కు ఒకే ఛార్జర్..