తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు.. హైదరాబాద్ గాంధీభవన్లో జరిగిన కార్యక్రమంలో పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.. పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు రేవంత్రెడ్డి.. ఈ సందర్భంగా తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితం టీఆర్ఎస్ పార్టీలో చేరి మోసపోయామన్నారు.. ఏజెన్సీ ప్రాంత రైతులను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించిన ఆయన.. పోడు భూముల పట్టాలు ఇస్తా అని ఎనిమిదేళ్లు నుండి మోసం చేస్తున్నారని మండిపడ్డారు.. ఇక, వరంగల్ వేదికగా రాహుల్ గాంధీ ఇచ్చిన డిక్లరేషన్ నచ్చింది.. పోడు భూములకు పట్టాలు ఇస్తా అని రాహుల్ గాంధీ మాటలు నమ్ముతున్నాం.. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని ప్రకటించారు తాటి వెంకటేశ్వర్లు.. ఈ కార్యక్రమంలో మామిడి జెడ్పీటీసీ కాంతారావు సహా మరికొందరు నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
Read Also: Breaking News : నందమూరి బాలకృష్ణకు కరోనా..