Food Safety : అమీర్‌పేట్‌లో జ్యూసులు తాగుతున్నారా..? జర జాగ్రత్త.. తరువాత మీ ఇష్టం..!
- అమీర్‌పేట్ జ్యూస్ సెంటర్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
- కుళ్లిన పండ్లు, తుప్పుపట్టిన కత్తులతో జ్యూస్ తయారీ కలకలం
- తనిఖీల్లో బయటపడ్డ ఉల్లంఘనలు.. జ్యూస్ సెంటర్లకు నోటీసులు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Food Safety: హైదరాబాద్ లో ఫుడ్ అంటే ఎంత పేరుగాంచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిర్యానీ నుంచి స్ట్రీట్ ఫుడ్ వరకు, నగరం రుచికరమైన ఆహార గమ్యస్థానంగా ఎంతో గుర్తింపు పొందింది. అయితే, ఇటీవల అమీర్‌పేట్‌లోని పలు ఫ్రూట్ జ్యూస్ సెంటర్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీలు ఆశ్చర్యకర విషయాలను వెలుగులోకి తెచ్చాయి. ఈ తనిఖీల్లో కుళ్లిన పండ్లు, అపరిశుభ్రమైన వంట పరిసరాలు, తుప్పుపట్టిన కత్తులు, ఫ్రిడ్జ్‌లలో బొద్దింకలు వంటి దిగ్భ్రాంతికరమైన విషయాలు బట్టబయలయ్యాయి. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ టాస్క్ ఫోర్స్ బృందం గురువారం అమీర్‌పేట్‌లోని పలు జ్యూస్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో బాంబే జ్యూస్ సెంటర్, నాచురల్ ఫ్లేవర్స్, కోకోనట్ జ్యూస్ బార్, KGN జ్యూస్ సెంటర్లు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించినట్లు వారు గుర్తించారు. ఈ జ్యూస్సెంటర్లకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006 కింద నోటీసులు జారీ చేశారు అధికారులు.
అయితే.. ఈ తనిఖీల్లో బాంబే జ్యూస్ సెంటర్లో ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసిన కుళ్లిన పండ్లు, కూరగాయలను జ్యూస్ తయారీకి ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇదే కాకుండా… KGN జ్యూస్ సెంటర్లో జ్యూస్ తయారీ ప్రాంతంలో ఈగలు తిరుగుతున్నాయి, ఫ్రిడ్జ్ అత్యంత అపరిశుభ్రంగా ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. కొన్ని జ్యూస్ సెంటర్లలో పండ్లు కట్ చేసేందుకు తుప్పుపట్టిన కత్తులను ఉపయోగిస్తున్నట్లు తేలిందని, ఫ్రూట్స్ నిల్వ చేసే ఫ్రిడ్జ్‌లలో బొద్దింకలు తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇదేకాకుండా… KGN జ్యూస్ సెంటర్లో పాడైన ఫ్రూట్ సలాడ్‌ను ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసి వినియోగదారులకు అమ్ముతున్నట్లు గుర్తించారు. బాంబే జ్యూస్ సెంటర్లో FSSAI లైసెన్స్ ప్రదర్శించలేదు, పెస్ట్ కంట్రోల్ రికార్డులు లేవు, ఫుడ్ హ్యాండ్లర్లు ఆహార తయారీ సమయంలో పరిశుభ్రత పాటించడం లేదని, డస్ట్బిన్లు తెరిచి ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
- Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
- ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
ఈ ఉల్లంఘనల కారణంగా బాంబే జ్యూస్ సెంటర్, నాచురల్ ఫ్లేవర్స్, కోకోనట్ జ్యూస్ బార్, KGN జ్యూస్ సెంటర్లకు ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ సంస్థలు FSSAI నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు, పరిశుభ్రత ప్రమాణాలను పాటించకపోవడం, KGN జ్యూస్ సెంటర్లో లైసెన్స్ లేకపోవడం, లేబులింగ్ నిబంధనలను పాటించకపోవడం వంటి ఉల్లంఘనలు కూడా బయటపడ్డాయి.
CM Revanth Reddy : తెలంగాణలో మరో భారీ పెట్టుబడి.. వ్యాపార దిగ్గజం మారుబెనీతో ఒప్పందం
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!