New Pensions: కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం.. నవంబర్ 19న అకౌంట్లోకి డబ్బులు జమ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నూతన లబ్ధిదారులకు ‘చేయూత’ పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం గురువారం ఘనంగా ప్రారంభమైంది. ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో మరో 4.5 లక్షల మంది అర్హులకు కొత్తగా పింఛన్లను మంజూరు చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో మంజూరు పత్రాల పంపిణీ ప్రక్రియ కొనసాగనుంది.
అసెంబ్లీ నియోజకవర్గాలు, మండల కేంద్రాలు, మున్సిపాలిటీల వారీగా నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరై లబ్ధిదారులకు స్వయంగా ప్రొసీడింగ్ పత్రాలను అందజేస్తున్నారు. ఏళ్లుగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలు, వితంతువులు, దివ్యాంగులు, వృద్ధుల చేతికి మంజూరు పత్రాలు అందడంతో వారి కుటుంబాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. ముఖ్యంగా ఈ కొత్త పింఛన్లలో మహిళలకు పెద్దపీట వేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
Also Read
- IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ.. హైదరాబాద్ కమిషనర్‌గా కొత్త బాస్..
- Nvidia Scandal: జెన్సన్ హువాంగ్-ఆలిస్లను కలిపింది ఆమె భర్తే.. ఎన్విడియా కేసులో ట్విస్ట్..
- Under -19 Asia Cup: ఆఫ్ఘనిస్థాన్ చిత్తు చిత్తు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్..
- Robbery: తనిష్క్లో భారీ చోరీ.. రూ.50 కోట్ల విలువైన నగలు అపహరణ..
లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖతో పాటు గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. దరఖాస్తుదారులకు ఏవైనా అభ్యంతరాలు లేదా సాంకేతిక సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కరించేందుకు వేదికల వద్ద ప్రత్యేక కౌంటర్లను కూడా అందుబాటులో ఉంచారు.
మంజూరు పత్రాల పంపిణీ ప్రక్రియ పూర్తయిన వెంటనే, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 19న నూతన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా పింఛన్ సొమ్మును జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటికే 1,23,625 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేయగా, తాజాగా మంజూరు చేసిన 4.5 లక్షల పింఛన్లతో కలిపి మొత్తం కొత్త లబ్ధిదారుల సంఖ్య 5,73,625కు చేరుకుంది.
తాజావార్తలు
-
New Pensions: కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం.. నవంబర్ 19న అకౌంట్లోకి డబ్బులు జమ..
-
IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ.. హైదరాబాద్ కమిషనర్‌గా కొత్త బాస్..
-
TG SAFE: పెద్ద బ్రాండ్లే కదా అని సేఫ్ అనుకుంటున్నారా? డొమినోస్, కేఎఫ్‌సీ స్టోర్లలో తనిఖీలతో కలకలం!
-
Nvidia Scandal: జెన్సన్ హువాంగ్-ఆలిస్లను కలిపింది ఆమె భర్తే.. ఎన్విడియా కేసులో ట్విస్ట్..
-
Under -19 Asia Cup: ఆఫ్ఘనిస్థాన్ చిత్తు చిత్తు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్..
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!